సూట్కేసులో మహిళ మృతదేహం | Woman’s body found stuffed in suitcase, cops suspect rape-murder | Sakshi
Sakshi News home page

సూట్కేసులో మహిళ మృతదేహం

Published Sat, Aug 13 2016 3:13 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

సూట్కేసులో మహిళ మృతదేహం - Sakshi

సూట్కేసులో మహిళ మృతదేహం

మధుర:  ఢిల్లీ-ఆగ్రా రహదారిపై మహిళ మృతదేహంతో ఉన్న ఒక సూట్ కేసు శనివారం ఉదయం కలకలం సృష్టించింది. ఆగ్రా సరిహద్దులో ఉన్న రాయ్పురా జత్  రోడ్డు పక్కన సూట్కేసు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూట్కేసును తెరిచి చూడగా అందులో సుమారు 35ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది.

మహిళ మృతదేహంపై లో దుస్తులు మాత్రమే ఉండగా.. శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. దుండుగలు ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా రెండురోజుల క్రితం మహిళను వేరే చోట హతమార్చి, అనంతరం మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి ...దుండగులు ఇక్కడ పడవేసి ఉంటారని ఎస్పీ అలోక్ ప్రియదర్శిని తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చాక అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. మహిళ ఛాయాచిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement