
తిరువొత్తియూరు: తిరుపూర్‌లోని తారాపురం రోడ్డు పక్కన ఓ డ్రైనేజీ కాలువలో స్కూట్ కేసులో కుక్కిన యువతి మృతదేహం పడిఉండడం స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు.. డ్రైనేజీ కాలువలో ఆదివారం ఓ సూట్ కేసులో పడి ఉండడం, అందులో నుంచి తీవ్రంగా దుర్వాసన వెలువడడంతో స్థానికులు వీరపాండి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ ఆనందన్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సూట్ కేసును తెరిచి చూడగా అందులో 30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment