tatto
-
దటీజ్ వైయస్ జగన్! వైరల్ అవుతున్న డై హార్డ్ ఫ్యాన్ టాటూ
-
'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్ ట్యాంక్ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్ యువకులు అబుబకర్, షోయబ్ రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్ పేర్ల సత్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్ ప్రతినిధులు అబుబకర్, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
షారుక్ ఖాన్ గుండుపై టాటు.. దాని అర్థమేంటి?
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా జవాన్‌పై అంచనాలు పెరిగాయి. ఇక జులై 10 విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. చర్చంతా టాటుపైనే షారుక్ సినిమా అంటే హీరో, హీరోయిన్లు ఎవరు? కథేంటి? అనే దానిపై చర్చ జరుగుతుండేది. కాని ఇప్పుడు నెట్టింట చర్చంతా షారుఖ్ గుండుపైనే నడుస్తుంది. జవాన్ ట్రైలర్ చివర్లో షారుఖ్ గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే అందరి దృష్టి షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న ఓ చిన్న టాటు మీద పడింది. షారుఖ్ ఎడమ చెపి పై భాగాన సంస్కృతంలో రాసి ఉన్న అక్షరాలను డీకోడ్ చేశారు. (చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇందులో వాస్తమెంతో తెలియదు కానీ ఆ టాటు మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక జవాన్ విషయానికొస్తే.. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. . అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The tattoo on #ShahRukhKhan's head from #JawanPrevue is "माँ जगत जननी " = Mother of the world.#Jawan pic.twitter.com/FOBUlxOwOl — Manobala Vijayabalan (@ManobalaV) July 13, 2023 -
జ్వాల ఆనందం
ఆనందం, సంతోషం.. బాధ, దుఖం.. దేన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరించే స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి అదేపని చేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆనందంలో వీపుపై ఉన్న ఒలింపిక్ టాటూ కనిపించే ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గుత్తా జ్వాల. అన్ని విధాల ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మనం సాధించాం..' అంటూ తన జోడి అశ్విని పొన్నప్పకు అభినందనలు తెలిపారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతోపాటు మొత్తం ఏడుగురు షట్లర్ల ఒలింపిక్ బెర్త్ లు మంగళవారం ఖరారయ్యాయి. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మను ఆత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా భావించిన ఏసియన్ బ్యాడ్మింటర్ చాపియన్ షిప్ పోటీలు ముగిసిన తర్వాత ర్యాంకులను బట్టి షట్లర్లను ఎంపిక చేశారు. ర్యాంకులు మే 5న అధికారికంగా ప్రకటిస్తారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జ్వాలా, అశ్వినిలు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తారు. సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు క్రీడాకారిణులు(సైనా, సింధు) బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్ లోనూ ఈసారి ఇద్దరిని పంపే అవకాశం లభించింది. అయితే పారుపల్లి కాశ్యప్ అనూహ్యరీతిలో గాయపడటం, శస్త్రచికిత్స చేయుంచుకోవడంతో ఇండియా ఆ అవకాశాన్ని కోల్పోక తప్పలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) నిబంధనల మేరకు 16వ ర్యాంకులోపు ర్యాకుల్లో ఉన్న క్రీడాకారుల్లో ఇద్దరిని ఒలింపిక్స్ కు పంపొచ్చు. శ్రీకాంత్, కాశ్యప్ లు ఇద్దరూ ప్రస్తుతం 16 కంటే తక్కువ ర్యాంకులోనే కొనసాగుతున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 రియో డి జెనిరో ఒలింపిక్స్ జరుగుతాయి. టాటూ వెనుక కథ.. గుత్తా జ్వాల ఎన్నటికీ మర్చిపోలేని పోటీలు.. 2012 లండన్ ఒలింపిక్స్. ఆ వేదికపై బ్యాడ్మింటర్ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించింది జ్వాల. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ బెర్త్ పొందిన మొదటి షట్లర్ ఆమె. అందుకే 2012 ఒలింపిక్ గుర్తును వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుంది. -
దేవతల టాటూ వేసుకున్నాడని...
బెంగళూరు: టాటూల క్రేజ్ ఓ ఆస్ట్రేలియన్ జంట చిక్కుల్లో పడేసింది. హిందూ దేవతల బొమ్మలను శరీరం మీద టాటూలుగా వేయించుకోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. వీపుపై గణేష్ బొమ్మను , ఎల్లమ్మ దేవత బొమ్మను కాలిపై టాటూ వేయించుకొని తమ మనోభావాలను అవమానించారంటూ వారు దాడికి దిగారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటన బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పర్యాటకుడు మాట్ కీత్(21) అతని గర్ల్ ఫ్రెండ్ ఒక హోటల్ లో కూర్చుని ఉండగా అతని కాలిపై హిందూ దేవత టాటూలను గమనించిన కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా భౌతికి దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం చెలరేగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు టాటూ తొలగించాల్సిందిగా ఆదేశించారు. కీత్ తో పాటు, బెంగళూరుకు చెందిన అతని స్నేహితురాలు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. టాటూను చెరిపేయాలంటూ ఆదేశించారు. అతని టాటూకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కాగా తనపై దాడిచేస్తున్న వారిని నివారించకుండా పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ కీత్ వాపోయాడు. తనచేత బలంతంతా క్షమాపణ పత్రం రాయించుకున్నారని ఆరోపించాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆ క్షమాపణ పత్రాన్ని కీట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రతీక్షణం తనను, తన గర్ల్ ఫ్రెండ్ ను దాడులనుంచి రక్షించుకోవాలా అంటూ ప్రశ్నించాడు. శారీరక, మానసిక హింసను భరించాల్సిన అవసరం ఆమెకు లేదన్నాడు. అయినా తనకు భారతదేశం, హిందూమతం మీద గౌరవం ఉందికనుకే దాదాపు 35 గంటలు స్టేషన్ లోనే ఉన్నానన్నాడు. అందరికీ సమానత్వం ఉండాలి, తమకు న్యాయం జరగాలని అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలంటూ విజ్క్షప్తి చేశాడు. మాట్ కీత్(21) అతని గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ కసియానో (20) బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో ఉంటూ లా చదువుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ అనంతరం దాడిచేసిన వారిపైన, విదేశీ జంటను వేధించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి సందీప్ పాటిల్ తెలిపారు. -
టాటూతో తంటాలు..!
కొత్త సినిమా వచ్చినా... అభిమాన నాయకుడు గెలిచినా.. టీవీ సీరియల్ లో ఓ క్యారెక్టర్ కు కాస్త ఇంపార్టెన్స్ పెరిగినా ఇంకేముంది యూత్ ఒంటిపై ఆ టాటూ కనపడాల్సిందే. ఇటీవల బాహుబలి సినిమాకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ లభించడంతో హీరో ప్రభాస్ టాటూ.. చైనాలో ఓ ఊపు ఊపింది. అలాగే ఒకానొక సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై తమ అభిమానం ప్రదర్శించాలనుకున్న ప్రజలు ఒంటిపై మోడీ పచ్చబొట్లను వేయించుకొన్నారు. ఇంతకీ ఈ టాటూల గొడవంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే టాటూలంటే అంత క్రేజ్ చూపించే యూత్ ప్రస్తుతం అవి చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఆకర్షణకోసం వేసుకున్న టాటూ న్యూయార్క్ కు చెందిన టిఫనీ పాస్టిరారో జీవితంలో ఓ పెద్ద అగాధాన్ని నింపింది. ఆమెకు సోకిన వింత వ్యాధి టాటూ వల్లనే అని తెలియడంతో ఆమెకు దగ్గరగా నిలబడేందుకు కూడ జనం భయపడుతున్నారు. విటిలిగో పేరున పిలుస్తున్న ఈ వ్యాధి ఆమెను ఎంతో ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తి కూడ చెందుతుండటం అందర్నీ వణికిస్తోంది. చర్మవ్యాధితో బాధపడుతున్న పాస్టిరారో ఒంటినిండా తెల్లని, నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను అందరూ దూరంగా పెట్టడమేకాక, హేళనగా కూడ మాట్లాడుతున్నారంటూ బాధపడుతోంది. తన శరీరంపై ఏర్పడిన మచ్చలు కనపడకుండా ఉండేందుకు దట్టంగా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టింది. అయితే అమెరికన్ టాప్ మోడల్స్ కంటెస్టెంట్ 2014 విన్నీ హార్లో ఓ టీవీలో శరీరంపై మచ్చలతో కనిపించడంతో పాస్టిరారో ఆశ్చర్యపోయింది. ఆమె మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని ఓ సందర్భంలో ప్రశ్నించింది కూడ. "విటిలిగో వ్యాధి సోకిన మరికొంతమంది కూడ ఉన్నారని నేను మొదటిసారి చూస్తున్నాను. మీకు కూడ ఈ వ్యాధి ఉందా? అని అడిగినప్పుడు ఆమె నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరిని పరిచయం కూడ చేసింది." అంటూ పాస్టిరారో విన్నీహార్లోతో మాట్లాడిన అనుభవాలను పలువురితో పంచుకుంటోంది. అంతేకాదు ఓ పెద్ద టాటూను తన శరీరంపై ఏర్పడ్డ మచ్చలపై వేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే టాటూ అభిమానుల్లో అవగాహన కలిగిస్తోంది. మరో అడుగేసి తనగురించి ఫేస్ బుక్ లో వివరాలు పెట్టి టాటూవల్ల కలుగుతున్న నష్టంపై జనంలో చైతన్యం రావాలని ఆశిస్తోంది. ఇంతకీ ఈ పచ్చబొట్లు ఎంత పురాతనమో తెలుసా! ఈ పచ్చబొట్ల చరిత్ర ఇప్పటిది కాదు... వేల సంవత్సరాల క్రితమే టాటూల సంప్రదాయం ఉన్నట్లు ఇటీవల బయటపడ్డ ఓ మమ్మీని బట్టి తెలిసింది. ఆ మమ్మీ శరీరంపై దాదాపు 61 టాటూలు ఉన్నట్లు గుర్తించారు. అంటే టాటూల క్రేజ్ జనంలో ఎంతగా ఉందో అర్థమౌతుంది.