యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా జవాన్‌పై అంచనాలు పెరిగాయి. ఇక జులై 10 విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి.
చర్చంతా టాటుపైనే
షారుక్ సినిమా అంటే హీరో, హీరోయిన్లు ఎవరు? కథేంటి? అనే దానిపై చర్చ జరుగుతుండేది. కాని ఇప్పుడు నెట్టింట చర్చంతా షారుఖ్ గుండుపైనే నడుస్తుంది. జవాన్ ట్రైలర్ చివర్లో షారుఖ్ గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే అందరి దృష్టి షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న ఓ చిన్న టాటు మీద పడింది. షారుఖ్ ఎడమ చెపి పై భాగాన సంస్కృతంలో రాసి ఉన్న అక్షరాలను డీకోడ్ చేశారు.
(చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!)
షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇందులో వాస్తమెంతో తెలియదు కానీ ఆ టాటు మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇక జవాన్ విషయానికొస్తే.. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. . అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
The tattoo on #ShahRukhKhan's head from #JawanPrevue is "माँ जगत जननी " = Mother of the world.#Jawan pic.twitter.com/FOBUlxOwOl
— Manobala Vijayabalan (@ManobalaV) July 13, 2023
Comments
Please login to add a commentAdd a comment