గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో | Former Mr Tamilnadu And Bodybuilder Yogesh Dies Of Heart Attack At Age 41 - Sakshi
Sakshi News home page

Mr Tamilnadu Yogesh Death: గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో

Published Tue, Oct 10 2023 7:18 AM | Last Updated on Tue, Oct 10 2023 9:38 AM

MR Tamilnadu And Bodybuilder Yogesh Passed Away - Sakshi

గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్​ విన్నర్​, ప్రముఖ బాడీ బిల్డర్​ యోగేశ్​ గుండెపోటుతో మరణించారు. 

(ఇదీ చదవండి: విజయ్‌కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్‌ కనకరాజ్‌)

కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్‌కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది.

యోగేష్ చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో  నివాసం ఉంటున్నాడు. అతను బాడీ బిల్డర్, కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. బాడీబిల్డింగ్‌లో 'మిస్టర్ తమిళనాడు' అవార్డును అందుకున్నాడు.  2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్​ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్​.. ఓ జిమ్​లో ట్రైనర్​గా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే జిమ్​కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్​.. బాత్​రూమ్​కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్​ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్​కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్​.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement