ట్రెండింగ్‌ బీజేపీ నేత బయోపిక్‌లో స్టార్‌ హీరో | Vishal To Act In Tamil Nadu BJP President's Biopic | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌ బీజేపీ నేత బయోపిక్‌లో స్టార్‌ హీరో

Published Sat, May 4 2024 6:43 AM | Last Updated on Sat, May 4 2024 3:27 PM

Vishal To Act In Tamil Nadu BJP President's Biopic

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బయోపిక్‌ ఉందా..? అందులో నటుడు విశాల్‌ అన్నామలై పాత్రలో నటించనున్నారా..? వంటి ప్రశ్నలు రాష్ట్రా వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. తమిళనాడులో బీజేపీ  అధ్యక్ష పగ్గాలను అన్నామలై చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. 

అన్నామలై రాజకీయాల్లోకి రాకముందు పోలీస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించారన్నది గమనార్హం. ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి అన్నామలై జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో అన్నమలై పాత్రలో విశాల్‌ నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. విశాల్‌ తాజాగా నటించిన రత్నం చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. 

తాజాగా ఆయన తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టి డిటెక్టివ్‌ 2 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఆయన 2026 ఎన్నికల పట్టికలో తన పేరు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వాగ్దాటి, ఆయన పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ నటుడు విశాల్‌ పేర్కొనడం గమనార్హం. కాగా అన్నామలై ఎలా పోలీస్‌ అధికారి అయ్యారు? ఆ తర్వాత ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించారు? వంటి ఆయన జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement