దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు | Bihar Cops Throw Accident Victim Body Into Canal | Sakshi
Sakshi News home page

దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు

Published Sun, Oct 8 2023 7:55 PM | Last Updated on Sun, Oct 8 2023 7:55 PM

Bihar Cops Throw Accident Victim Body Into Canal - Sakshi

పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ బాధితుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి తరలించారు.  

పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. అయితే.. ఓ ప్రమాదంలో చిధ్రమైన మృతదేహాన్ని ఇలా కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ బాధిత మృతదేహం ఎవరిదో కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు.  

పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ చిధ్రమైన మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు. 

ఇదీ చదవండి: యువకుడి బ్యాంక్‌ ఖాతాలో 753 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement