
టొరంటో : 73 ఏళ్ల మహిళ అంటే శక్తి ఉడిగిన స్ధితిలో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారనుకునే వారిని ఈ బామ్మ షాక్‌కు గురిచేస్తుందనే చెప్పాలి. కెనడాలోని ఒంటెరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు జాన్ మెక్‌డొనాల్డ్ కండలు తీరిన దేహంతో ఔరా అనిపిస్తున్నారు. గతంలో అధిక బరువున్న జాన్ హైబీపీ, కొలెస్ర్టాల్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకునేవారు. 198 పౌండ్ల బరువుండే జాన్ మెక్‌డొనాల్డ్ నిత్యం కసరత్తులు, వ్యాయామాలతో ఏకంగా 50 పౌండ్లు తగ్గి కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నారు.
బరువులు ఎత్తడంతో పాటు తాను జిమ్ చేస్తున్న ఫోటోలతో ఆమె ఫిట్‌నెస్‌పై ఏకంగా ఇన్‌స్టాగ్రాం పేజ్‌ను నిర్వహిస్తున్నారు. తాను సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు అమినో యాసిడ్స్, ప్రొటీన్ షేక్స్ వంటి సప్లిమెంట్స్‌ను తీసుకుంటానని ఆమె చెబుతున్నారు. ఈ బామ్మ ఇన్‌స్టా పేజీకి ఇప్పుడు 5,00,000 మంది ఫాలోయర్లు ఉండటంతో ఈ సీనియర్ బాడీబిల్డర్ సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment