సాక్షి, బెంగళూరు: చిన్న వయసులోనే అందరూ అబ్బురపడేలా బాడీ బిల్డర్ అయ్యాడు. అందుకోసం పగలూ రాత్రి శ్రమించాడు. కానీ అతని కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. బెంగళూరులో ఒక బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణరాజపురం వద్ద హీరండహళ్లిలో జరిగింది. శ్రీనాథ్ (22) అనే బాడీ బిల్డర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ పాయింట్ కాలేజీలో శ్రీనాథ్ డీఫార్మసీ చదువుతున్నాడు. బాడీ బిల్డర్‌గా తయారై పలు దేహధారుడ్య పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు.
ఏం సమస్య వచ్చిందో కానీ మంగళవారం తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. కోలారు జిల్లా శ్రీనివాసపురకు చెందిన శ్రీనాథ్ మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అవలహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment