చావు చెప్పి రాదు. అయితే.. దానిని కెలికి మరీ ఆహ్వానించడం ఎంత వరకు సబబు?.. పాముల్ని పట్టేవాడు దాని కాటుకే బలవుతాడని ఎవరో అన్నారు. వెతుక్కుంటూ వెళ్లి మరీ మృత్యువును పలకరించే ఘటనలు తరచూ మనం చూస్తుంటాం కూడా. అలాంటిదే ఇది..
జిమ్ ట్రైనర్.. అదీ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్.. దానికి తోడు ఫిట్‌నెస్ ప్రియులకు జాగ్రత్తలు చెప్పే ట్రైనర్.. వెయిట్‌లిఫ్టింగ్Squat చేస్తూ మరణిస్తే?..
ఇండోనేషియా బాడీబిల్డర్, అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ జస్టిన్ విక్కీ(33) Justyn Vicky కెమెరా సాక్షిగా ప్రాణం విడిచాడు. సుమారు 400 పౌండ్ల బరువును(210 కేజీలు) ఎత్తే క్రమంలో మెడ విరిగి తీవ్రంగా గాయపడి చనిపోయాడతను. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని.. జులై 15వ తేదీన ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురించాయి.
మెడ విరగడంతో పాటు గుండెకు, లంగ్స్(కాలేయం) నరాలు దెబ్బతిని అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతి బరువు ఎత్తే రిస్క్ చేయడం.. ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే అతని మరణానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్‌లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment