Little Hercules Now: World Strongest Boy Richard Sandrak Present Look Goes Viral - Sakshi
Sakshi News home page

Little Hercules Present Look: అప్పడు అత్యంత పిన్న వయసు బాడీబిల్డర్‌... ఐతే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే!!

Published Sun, Dec 26 2021 4:19 PM | Last Updated on Sun, Dec 26 2021 6:29 PM

Worlds Strongest Boy Now Looks Unrecognisable As An Adult - Sakshi

చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యచకితులను చేసి పేరుగాంచిన చిన్నారుల గురించి విని ఉన్నాం. కొంతమంది ఆ ప్రతిభను తమ జీవితాంతం కొనసాగిస్తే. మరికొందరికి పెద్దయ్యాక చిన్నప్పటి ప్రతిభ కనుమరగవుతుందో లేక వాళ్లకి ఇక ఆసక్తి తగ్గిపోతుందో తెలియదుగాను వారిలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అచ్చం అలానే ఉక్రెయిన్‌కి చెందిన బాలుడు  చిన్న వయసులోనే బాడీబిల్డర్‌గా పేరుగాంచాడు. కానీ ఇప్పడూ ఆ బాలుడిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

(చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!)

అసలు విషయంలోకెళ్లితే.....ఉక్రేనియాకి చెందిన రిచర్డ్ సాండ్రాక్ 1992లో జన్మించాడు. అతను 2000 సంవత్సరం నుండి  అతని పేరు మారు మ్రోగిపోయింది.  కేవలం ఆరేళ్ల ప్రాయం నుండే 85 కిలోలు బరువులు ఎత్తాడు. ఇక ఎనిమిదేళ్లకు 95 కిలోలు వరకు బరువులు ఎత్తి ప్రపంచంలోనే బలమైన బాలుడిగా పేరుగాంచాడు. అంతేకాదు ఆ బాలుడికి 'లిటిల్ హెర్క్యులస్' అని పేరు కూడా పెట్టారు. అతి చిన్న వయసులో బాల సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ పేరు ప్రఖ్యాతుల వెనుకు ఆ బాలుడి కఠోర శ్రమ అసాధారణమైనది. అంతేకాదు ఆ చిన్న వయసులో ఆ బాలుడు తన తండ్రితో కలిసి రోజుకి ఏడు గంటలు వ్యాయమం చేసేవాడు. పైగా రోజుకు 600 పుష్‌అప్‌లు, 300 స్క్వాట్‌లు చేసేవాడు.

కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌తో మంచి దేహదారుఢ్యాని సొంత చేసుకుని పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే ఈ వ్యాయమాల వల్ల ఆ బాలుడి శరీరంలో కొవ్వు స్థాయిలు పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అతని తల్లిదండ్రుల పై సర్వత్రా విమర్శలు రావడమే కాదు ఈ మేరకు అతని పై ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేశారు. అయితే ట్విస్ట్‌ ఏంటంటే ఇది అప్పటి సంగతి కానీ ఇప్పుడు అతన్ని చూస్తే మాత్రం ఆ బాలుడేనా అనే సందేహం కలగకమానదు. అయితే ఆ బాలుడికి ఇప్పుడు 29 ఏళ్లు.  తాను ఇప్పుడు ఎటువంటి బరువులు ఎత్తడం లేదని చెప్పాడు. ప్రస్తుతం అతను హాలీవుడ్ స్టంట్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. బరువులు ఎత్తడం బోరు కొట్టేసిందని ఇప్పుడూ తాను నాసా సంబంధించిన క్వాంటం శాస్త్రవేత్త కావలన్నదే తన ధ్యేయమని చెప్పాడు.

(చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్‌ క్రీమ్‌లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement