బాలీవుడ్‌లో తొలి చిత్రమే సూపర్‌హిట్. యాక్టర్‌గా మంచి పేరు. బాలీవుడ్‌కి మంచి ఫిట్‌నెస్ హీరో దొరికాడు అనుకున్నారు. నెక్ట్స్ సల్మాన్ ఖాన్ అన్నారు. కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక జీవితంలో మజా ఏముంది? ఎన్నో అంచనాలతో నిర్మించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. కెరీర్ ఫ్లాప్ కావడంతో నటనకు గుడ్‌బై..అయితేనేం ఇపుడు ఎంతోమంది సూపర్ స్టార్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరో అతను చేస్తున్న వ్యాపారం ఏంటి? ఫిట్ నెస్ ఫ్రీక్, ఫిట్‌నెస్ ఐకాన్, సాహిల్ ఖాన్ సక్సెస్ స్టోరీ ఏంటి?
1975 నవంబరు 5న కోలకతాలో పుట్టిన సాహిల్‌ఖాన్ హిట్ మ్యూజిక్ వీడియో 'నాచెంగే సారీ రాత్'తో పాపులర్ అవ్వడమే కాదు మూవీ మేకర్స్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా 2001లో, చిన్న బడ్జెట్ చిత్రం 'స్టైల్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. శర్మన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అంతే సాహిల్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఫైల్‌కుగా సీక్వెల్ 'ఎక్స్‌క్యూస్ మీ'నిర్మించారు. శర్మన్ జోషి , సాహిల్ ఖాన్‌లు మరోసారి 'ఎక్స్‌క్యూస్ మీ'లో ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ కలెక్షన్ల విషయంలో బోల్తా పడింది. శర్మాన్ జోషి బాలీవుడ్‌లో నిలబడగలిగాడు కానీ సాహిల్ ఖాన్ యాక్టిగ్ కెరీర్ మాత్రం అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు.
'ఎక్స్‌క్యూస్ మీ' తర్వాత, 2005 విడుదలైన 'యాహీ హై జిందగీ', 'డబుల్ క్రాస్' కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. సాహిల్ ఖాన్ 'అల్లాదీన్' ,'రామా: ది సేవియర్' కూడా ఘోరంగా విఫలమయ్యాయి. టెలివిజన్ రంగంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఫిట్‌నెస్ పరంగా సల్మాన్ ఖాన్‌కు గట్టి పోటీగా ‘నెక్స్ట్ సల్మాన్ ఖాన్’ గా ఉంటాడనుకున్న సాహిల్ ఖాన్ ఇక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోకస్‌ను వేరే వైపు మళ్లించాడు.
2010లో బాడీబిల్డర్ , ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సాహిల్ ఖాన్ నటనకు స్వస్తి చెప్పి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారిపోయాడు. ముంబైలోనే అతి పెద్ద జిమ్‌ని స్థాపించాడు, అంతే స్వయంగా బాడీ బిల్డర్ కావడంతో సాహిల్ ఖాన్ ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. చిన్న మొత్తం పెట్టుబడితో మొదలై దేశవ్యాప్తంగా అనేక జిమ్‌లను నడుపుతూ ఈ వ్యాపారంలో తనకెదురే లేదని నిరూపించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు..తన ఫిట్‌నెస్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే డివైన్ న్యూట్రిషన్ అనే తన సొంత కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వెయ్ ప్రొటీన్, క్రియేటిన్ , మజిల్ గెయినర్స్ వంటి ఫిట్‌నెస్ సప్లిమెంట్లను విక్రయాల్లో దూసుకుపోయాడు. ఈ డివైన్ న్యూట్రిషన్ ఫిట్‌నెస్ వ్యాపారమే నెట్‌వర్త్ రూ. 100 కోట్లకు పై మాటే. ముంబై బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. 2017లో సాహిల్ తన యాంటీ-డోపింగ్ సిక్స్-ప్యాక్ ఎనర్జీ డ్రింక్‌ని లాంచ్ చేసిన మరింత పాపులర్ అయ్యాడు.
ఇది కాకుండా యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారీగానే ఆర్జిస్తున్నాడు. ఫిట్‌నెస్ గురించి అవగాహన కల్పించేలా ఒక యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు 3.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు , అతని వీడియోలను 29 కోట్లకు పైగా వీక్షించారు. దీని విలువ మొత్తం 40-60 కోట్లు. 2021లో సాహిల్ ఖాన్ ప్రపంచ ప్రఖ్యాత ఫిట్‌నెస్ ఈవెంట్ ప్రెజెంటింగ్ స్పాన్సర్ మి.ఒలింపియా గా నిలిచిన తొలి భారతీయ బాడీ బిల్డర్ సాహిల్ కంపెనీ పీనట్ బట్టర్ యూఎస్ ఎఫ్‌డీఏ సర్టిఫికేట్ తొలి భారతీయ కంపెనీ.
సాహిల్ ఖాన్ ఇప్పుడు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. సినిమాల్లోనూ కనిపిస్తున్న సాహిల్ ఖాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో మరింత బిజీగా ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం మొత్తం సంపద రూ. 170 కోట్లు. ముంబైలోని అనేక సంస్థల నుండి అవార్డుల తోపాటు, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు సాహిల్ ఖాన్.
సాహిల్‌కి విలాసవంతమైన ఇల్లు మాత్రమే కాదు, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఫెరారీ వంటి అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. 2003లో సాహిల్ ఖాన్ నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 2005లో ఈ దంపతులు విడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment