Sahil Khan
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) -
తొలి మూవీ బ్లాక్ బస్టర్, సంచలన నిర్ణయం.. షాకింగ్ నెట్‌వర్త్
బాలీవుడ్లో తొలి చిత్రమే సూపర్‌హిట్. యాక్టర్‌గా మంచి పేరు. బాలీవుడ్‌కి మంచి ఫిట్నెస్ హీరో దొరికాడు అనుకున్నారు. నెక్ట్స్ సల్మాన్ ఖాన్ అన్నారు. కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక జీవితంలో మజా ఏముంది? ఎన్నో అంచనాలతో నిర్మించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. కెరీర్ ఫ్లాప్ కావడంతో నటనకు గుడ్‌బై..అయితేనేం ఇపుడు ఎంతోమంది సూపర్ స్టార్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరో అతను చేస్తున్న వ్యాపారం ఏంటి? ఫిట్ నెస్ ఫ్రీక్, ఫిట్నెస్ ఐకాన్, సాహిల్ ఖాన్ సక్సెస్ స్టోరీ ఏంటి? 1975 నవంబరు 5న కోలకతాలో పుట్టిన సాహిల్‌ఖాన్ హిట్ మ్యూజిక్ వీడియో 'నాచెంగే సారీ రాత్'తో పాపులర్ అవ్వడమే కాదు మూవీ మేకర్స్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా 2001లో, చిన్న బడ్జెట్ చిత్రం 'స్టైల్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. శర్మన్ జోషి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అంతే సాహిల్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఫైల్కుగా సీక్వెల్ 'ఎక్స్క్యూస్ మీ'నిర్మించారు. శర్మన్ జోషి , సాహిల్ ఖాన్లు మరోసారి 'ఎక్స్క్యూస్ మీ'లో ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ కలెక్షన్ల విషయంలో బోల్తా పడింది. శర్మాన్ జోషి బాలీవుడ్లో నిలబడగలిగాడు కానీ సాహిల్ ఖాన్ యాక్టిగ్ కెరీర్ మాత్రం అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. 'ఎక్స్క్యూస్ మీ' తర్వాత, 2005 విడుదలైన 'యాహీ హై జిందగీ', 'డబుల్ క్రాస్' కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. సాహిల్ ఖాన్ 'అల్లాదీన్' ,'రామా: ది సేవియర్' కూడా ఘోరంగా విఫలమయ్యాయి. టెలివిజన్ రంగంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఫిట్నెస్ పరంగా సల్మాన్ ఖాన్‌కు గట్టి పోటీగా ‘నెక్స్ట్ సల్మాన్ ఖాన్’ గా ఉంటాడనుకున్న సాహిల్ ఖాన్ ఇక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోకస్‌ను వేరే వైపు మళ్లించాడు. 2010లో బాడీబిల్డర్ , ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సాహిల్ ఖాన్ నటనకు స్వస్తి చెప్పి ఫిట్నెస్ ట్రైనర్‌గా మారిపోయాడు. ముంబైలోనే అతి పెద్ద జిమ్ని స్థాపించాడు, అంతే స్వయంగా బాడీ బిల్డర్ కావడంతో సాహిల్ ఖాన్ ఇక వెనక్కి తిరిగి చూసింది లేదు. చిన్న మొత్తం పెట్టుబడితో మొదలై దేశవ్యాప్తంగా అనేక జిమ్‌లను నడుపుతూ ఈ వ్యాపారంలో తనకెదురే లేదని నిరూపించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు..తన ఫిట్నెస్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే డివైన్ న్యూట్రిషన్ అనే తన సొంత కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వెయ్ ప్రొటీన్, క్రియేటిన్ , మజిల్ గెయినర్స్ వంటి ఫిట్నెస్ సప్లిమెంట్లను విక్రయాల్లో దూసుకుపోయాడు. ఈ డివైన్ న్యూట్రిషన్ ఫిట్నెస్ వ్యాపారమే నెట్‌వర్త్ రూ. 100 కోట్లకు పై మాటే. ముంబై బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. 2017లో సాహిల్ తన యాంటీ-డోపింగ్ సిక్స్-ప్యాక్ ఎనర్జీ డ్రింక్‌ని లాంచ్ చేసిన మరింత పాపులర్ అయ్యాడు. ఇది కాకుండా యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారీగానే ఆర్జిస్తున్నాడు. ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించేలా ఒక యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు 3.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు , అతని వీడియోలను 29 కోట్లకు పైగా వీక్షించారు. దీని విలువ మొత్తం 40-60 కోట్లు. 2021లో సాహిల్ ఖాన్ ప్రపంచ ప్రఖ్యాత ఫిట్నెస్ ఈవెంట్ ప్రెజెంటింగ్ స్పాన్సర్ మి.ఒలింపియా గా నిలిచిన తొలి భారతీయ బాడీ బిల్డర్ సాహిల్ కంపెనీ పీనట్ బట్టర్ యూఎస్ ఎఫ్‌డీఏ సర్టిఫికేట్ తొలి భారతీయ కంపెనీ. సాహిల్ ఖాన్ ఇప్పుడు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. సినిమాల్లోనూ కనిపిస్తున్న సాహిల్ ఖాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో మరింత బిజీగా ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం మొత్తం సంపద రూ. 170 కోట్లు. ముంబైలోని అనేక సంస్థల నుండి అవార్డుల తోపాటు, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు సాహిల్ ఖాన్. సాహిల్‌కి విలాసవంతమైన ఇల్లు మాత్రమే కాదు, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఫెరారీ వంటి అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. 2003లో సాహిల్ ఖాన్ నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 2005లో ఈ దంపతులు విడిపోయారు. -
నిద్రమాత్రలు మింగిన నటుడు.. మరో నటుడిపై కేసు నమోదు
మోడల్, బాడీబిల్డర్, నటుడు మనోజ్ పాటిల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసును నటుడితో పాటు మరో ముగ్గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మనోజ్‌పాటిల్ గురువారం ఓషివారాలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది ఉదయం ఒంటి గంట సమయంలో జరగగా గమనించిన ఆయన కుంటుంబ సభ్యులు కూపర్ ఆసుపత్రికి తరలించారు. అతని వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాహిల్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. సాహిల్ ఖాన్ తన కొడుకును మానసికంగా వేధించాడని మనోజ్ పాటిల్ తల్లి మీడియాకి తెలిపింది. అది ప్రాణాలను తీసుకునే దాకా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదైన అనంతరం నటుడు సాహిల్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాజ్ ఫౌజ్దార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఢిల్లీకి చెందిన అతనికి మనోజ్ రూ.2 లక్షలు తీసుకుని, గడువు ముగిసిన స్టరాయిడ్స్ ఇచ్చాడని తెలిపాడు. దీంతో గుండె, చర్మ సమస్యలు వచ్చాయని చెప్పాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా రాజ్ ఫౌజ్దార్ను ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. లావాదేవీలకి సంబంధించిన అన్ని రసీదులు చూపించి సహాయం చేయమని కోరగా, అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాను. అంతేకానీ నాకు ఈ విషయానికి ఏం సంబంధం లేదు’ అని సాహిల్ ఖాన్ తెలిపాడు. మరోవైపు ఇంతకుముందే సాహిల్ సోషల్ మీడియాలో తన ఇమేజీని దెబ్బతీస్తున్నాడని ఆరోపిస్తూ మనోజ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ బాడీబిల్డర్ మేనేజర్ తెలిపాడు. -
ముగ్గురిని బలి తీసుకున్న ఎలుగుబంటి
ఛత్తీస్‌ఘడ్: ఎలుగుబంటి దాడిలో అటవీశాఖ అధికారి సహా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని మహసాముంద్ జిల్లాలో నవగాన్ అటవీప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మృతులు.. డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అధికారి శాహిల్ ఖాన్, దన్సిన్హ్ కన్వర్(65), షత్రూన్ శిదార్ (35) గా జిల్లా పోలీసు అధికారి ఆదివారం పిటిఐకి వెల్లడించారు. శనివారం ఉదయం కన్వర్, శిదార్ ఇద్దరు ఆవాల పూలను సేకరించేందుకు నవగాన్ అడవికి వెళ్లారు. అయితే అడవికి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన బంధువులు వారిని వెతికేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సహాయంతో అడవిలోకి వెళ్లగా.. ఎలుగుబంటికి చేరువలో కన్వర్, శిదార్ మృతదేహాలు తారసపడ్డాయి. అది గమనించిన ఎలుగుబంటి వారిపై కూడా దాడికి పాల్పడింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన అటవీశాఖ అధికారి శాహిల్ ఖాన్ అక్కడిక్కడే మృతిచెందాడు. -
హీరో సోదరికి గ్యాంగ్ స్టర్ ఝలక్..
ముంబయి: అసలే అతడు పాత నేరస్తుడు. పైగా గ్యాంగ్ స్టర్. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు చేసిన నేరాల కారణంగా ముంబయి, థానే వంటి నగరాల్లో అడుగుపెట్టొద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించి అతడిని బహిష్కరించారు. అలాంటి వ్యక్తిని నమ్మి టెస్ట్ డ్రైవింగ్ కారు ఇస్తే చేతివాటం చూపించకుండా ఊరుకుంటాడా. సరిగ్గా ముంబయిలో అదే జరిగింది. గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కారును టెస్టు డ్రైవింగ్ కోసం తీసుకెళ్లి పరారయ్యాడు. ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు గడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే సాహిల్ ఖాన్ సోదరి షయిస్టా తమ మెర్సిడీస్ కారును ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మకానికి పెట్టదలుచుకున్నారు. అ క్రమంలోనే దాని వివరాలు ఫొటోలతో సహా ఆన్ లైన్ లో ఈ నెల 7న పెట్టింది. ఈ ప్రకటన చూసిన పటేల్.. సాహిల్ సోదరికి అక్టోబర్ 8న ఫోన్ చేశాడు. అదే రోజు అక్టోబర్ 8న కాందివ్లీ అనే గ్రామం వద్ద సాయంత్రం కలుసుకున్నాడు. తాను రూ.42 లక్షలు చెల్లించి కారును సొంతం చేసుకుంటానని, అంతకంటే ముందు టెస్ట్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. మరో రోజు ఉదయం 8 గంటలకు పజీరో జీపు(ఎంహెచ్-03-ఏఎం-5832) లో మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చాడు. అనంతరం డీల్ కుదుర్చుకుని సాహిల్ కారు డ్రైవర్ అర్షాద్ అన్సారీ చేతిలో రూ.50 వేలు పెట్టాడు. టెస్టు డ్రైవింగ్‌కు వెళ్లొచ్చాడు. మిగితా డబ్బు చెల్లించాక కారు తీసుకెళ్తానని చెప్పాడు. అయితే, తన ఖాతాలో మిగితా డబ్బు చెల్లించాలని షయిస్టా చెప్పింది. అలాగే, అని మరో రోజు ఉదయం ఏకంగా ఆమె ఇంటికి ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి మరోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం అడిగాడు. అలా రెండోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం కారును తీసుకెళ్లిన పటేల్ ఇక తిరిగి ముఖం చూపించలేదు. ఈ విషయం చివరికి షయిస్టా తన సోదరుడికి చెప్పడంతో అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు.