
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan).. 48 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కాడు. ఫిబ్రవరి 9న ప్రియురాలు మిలేనా అలెగ్జాండ్ర (22)ను వివాహం చేసుకున్నాడు. ఫైనల్లీ నా బేబీతో పెళ్లి జరిగిందంటూ పలు ఫోటోలను సాహిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నటుడికి ఇది రెండో పెళ్లి కాగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ఈ వేడుకకు వేదికగా మారింది. ఈ దంపతుల మధ్య వయసు వ్యత్యాసం 26 ఏళ్లు ఉండటం గమనార్హం!
పరిచయం
ఏజ్ గ్యాప్‌తో పాటు, తన ప్రేమకథ గురించి సాహిల్ మాట్లాడుతూ.. ఒక రెస్టారెంట్‌కు నా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాను. అక్కడ అలెగ్జాండ్ర (Milena Alexandra)ను చూశాను. ఆమె తన తల్లితో కలిసి డిన్నర్ చేస్తోంది. తనను చూడగానే ఫిదా అయిపోయిన నేను మోడలింగ్ కోసం ఫోటోషూట్ చేస్తావా? అని అడిగాను. అందుకామె తనకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించింది.

26 ఏళ్ల ఏజ్ గ్యాప్
తను మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నానంది. పెళ్లి, పిల్లలతో కుటుంబజీవితం గడపాలనుందని చెప్పింది. తన నిజాయితీ, సింప్లిసిటీ నన్ను మరింత ఆకట్టుకున్నాయి. అప్పుడే తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా రెస్టారెంట్‌లో మా ప్రయాణం మొదలైంది. నాకంటే తను 26 ఏళ్లు చిన్నది. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు. తను కూడా అదే నమ్మింది.
అప్పుడు 21 ఏళ్లు మాత్రమే
ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. కలిసి ముందుకు సాగడం. నాకు తను పరిచయమైనప్పుడు ఆమ వయసు 21 ఏళ్లు మాత్రమే! కానీ చాలా విషయాల్లో ఆమె ఎంతో హుందాగా ఆలోచిస్తుంది. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంది అని చెప్పుకొచ్చాడు. కాగా సాహిల్.. స్టైల్, ఎక్స్‌క్యూజ్‌మీ, అల్లావుద్దీన్, రామా: ద సేవియర్ వంటి చిత్రాల్లో నటించాడు.
చదవండి: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్