సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, నాణ్యత లేని గాలి కారణంగా భారత్‌లో రెండేళ్లలోపు శిశువుల్లో మానసికంగా ఎదుగుదల సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తేలింది. సాధారణంగా రెండేళ్ల లోపు వయసున్న శిశువుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో స్పర్శ, అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. జ్ఞానేంద్రియాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు.
కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల మెదడు అభివృద్ధిలో వేగం మందగిస్తుందని, ఈ ప్రతికూల ప్రభావం జీవితాంతం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్యం వల్ల శిశువుల్లో మానసికపరమైన ఎదుగుదలతో పాటు భావోద్వేగ, ప్రవర్తన సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, ఇవి వారి కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ స్పెన్సర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment