
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో చెత్త సేకరిస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాస్కులు లేకుండానే వారు చెత్త సేకరణకు వెళ్లడంతో ఇంటి యజమానులు అభ్యంతరం చెప్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యలు పాటించకుండా, గుర్తింపు కార్డులు లేకుండా ఇళ్లల్లోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని తమకు గుర్తింపు కార్డులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కోరుతూ మాల్కాజిగిరి జోన్‌లోని పారిశుధ్య కార్మికులు డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసారు.
(చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!)
లాక్‌డౌన్ నేపథ్యంలో గుర్తింపు కార్డులు లేవని పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, చెత్త సేకరణకు వెళితే ఇంటి యజమానులు సైతం గుర్తింపు కార్డులు, మాస్కులు ధరించపోతే రావద్దంటున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. కాగా, పారిశుధ్య కార్మికులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చెత్త సేకరణ ఆగిపోతుందని వారు హెచ్చరించారు.
(చదవండి: దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే: నటి)
Comments
Please login to add a commentAdd a comment