
‘డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా’.. ఈ సామెత మనం చాలా సార్లే వింటుంటాం.. అయితే ఈ ఫొటోలో ఉన్న కుక్కకు మాత్రం అలా కాదు.. దీనికి డబ్బులు చెట్లకే కాస్తాయి.. అదెలా అనుకుంటున్నారా..? దీని పేరు నీగ్రో.. దీనికి ఏదైనా తినాలనిపిస్తే చాలు దుకాణానికి వెళ్లి చెట్ల ఆకులు ఇస్తుంది. వెంటనే ఆ దుకాణదారుడు దానికి కావాల్సింది ఇచ్చేస్తారు. నీగ్రో కొలంబియాలోని కాసనేర్ మాంటెర్రీ అనే యూనివర్సిటీలో ఉంటుంది. నీగ్రోను అక్కడి టీచర్లు దత్తత తీసుకున్నారు.
విద్యార్థులకు నీగ్రో అంటే చాలా ఇష్టం. దీంతో వారంతా అప్పుడప్పుడు తినుబండారాలు కొనిస్తూ ఉంటారు. వారు డబ్బులిస్తూ దుకాణంలో కొనడం చూసిన మన నీగ్రోకు ఓ ఐడియా వచ్చింది. విద్యార్థులు తినుబండారాలు కొనివ్వనప్పుడు తాను కూడా తినుబండారాలను కొనుక్కోవాలని డిసైడ్ అయింది. విద్యార్థులు ఏదో ఇచ్చి కొనడం క్షుణ్నంగా పరిశీలించిన నీగ్రో.. చెట్ల ఆకులు తీసుకెళ్లి ఇస్తూ ఉండేది.. దుకాణదారులు కూడా ముచ్చట పడి ఏదో ఒకటి ఇస్తుంటారు. ప్రతి రోజూ బిస్కెట్ల కోసం వస్తూ ఉంటుందని గ్లాడిస్ బరెటో అనే దుకాణదారుడు చెబుతున్నాడు. నీగ్రో చాలా తెలివైన కుక్కండీ బాబోయ్ అని అక్కడి వారంతా తెగ సంబరపడతారు..
Comments
Please login to add a commentAdd a comment