![Covid Patient Tragedy In Government Hospital In Karimnagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/26/covid.jpg.webp?itok=_XdZ4USb)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కరీంనగర్ టౌన్: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరోనాతో మృతిచెందగా మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా 6 గంటలపాటు వార్డులోనే ఉంచారని మృతుడి బంధువులు ఆరోపించారు.
అంబులెన్స్‌లు లేవని వచ్చే వరకు వేచిచూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆస్పత్రి కరోనా పేషెంట్లతో నిండుతుండగా మృతదేహాలను ఇలా గంటల తరబడి వార్డులోనే ఉంచడంతో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment