patient dead
-
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
మా నాన్నను కాపాడండి.. రోగి ప్రాణం తీసిన 108.. ఎలాగో తెలుసా?
ఆపదలో మనుషుల ప్రాణాల కాపాడే 108 వాహనమే ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ధనాపూర్ ప్రాంతానికి చెందిన తెజియా(40) పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో, ఆందోళన చెందిన తెజియా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ తజియాను తీసుకుని సమీప ఆసుపత్రికి బయలుదేరింది. కాగా, కొంత దూరం వెళ్లాక రత్లం రోడ్ టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా సడెన్‌గా అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో, అంబులెన్స్ ఎందుకు ఆగిపోయిందని తజియా కుటుంబ సభ్యులు ఆగడంతో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. ఈ క్రమంలో తజియా ప్రాణాలు కాపాడేందకు రోగి కుమార్తె, అల్లుడు అంబులెన్స్‌ను ఒక కిలోమీటరు దూరం నెట్టారు. పెట్రోల్ బంక్ రాగానే బాధితులు అంబులెన్స్‌లో రూ.500 కొట్టించినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబులెన్స్ స్టార్ట్ కాకపోవడంతో మరో అంబులెన్స్‌కు ఫోన్ చేయగా గంట తర్వాత వచ్చిందనన్నారు. దీంతో, హుటాహుటిన తజియాను ఆసుపత్రికి తరలించగా.. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో తజియా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంబులెన్స్ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో వైద్యశాఖ అధికారులు చర్యలకు దిగారు. ఈ ఘటనపై సీఎంహెచ్వో స్పందిస్తూ.. విచారణ ప్రారంభించాము. తాము బాధితుడి బంధువులను కలవనున్నట్టు తెలిపారు. 108ని ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యత వారిదే. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. #WATCH #Ambulance ran out of #diesel in #Banswara, patient died on the road. ◆ Daughter-son-in-law pushed the ambulance for 1 KM to save #life. #Rajasthan #Banswara #Ambulance #RajasthanNews #NewsUpdates #Rajasthan #Banswara #Jaipur pic.twitter.com/17lJ3LEuoN — Harish Deshmukh (@DeshmukhHarish9) November 26, 2022 -
Hyderabad: 15 రోజులకు రూ.16 లక్షలు వసూల్.. అయినా దక్కని ప్రాణం
సాక్షి, హైదరాబాద్: మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి వద్ద రూ.16 లక్షలు వసూలు చేసి ఆస్పత్రి వైద్యులు అతనికి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. సబ్జి మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర (54) గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి రాగా.. ట్రీట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. అయినా సరైన వైద్యం అందించక పోవడంతో అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జై కిషన్ భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అతని ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తక్షణమే ప్రభుత్వం, మంత్రులు , పోలీసులు స్పందించి ప్రీమియర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే! -
ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు?.. ఆ రోజు అసలు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్/ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో ఎలుక ఘటన కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావును ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. వరంగల్ కలెక్టర్ గోపి అధ్యక్షతన ఎంజీఎం వైద్యులకు సంబంధం లేకుండానే అంతర్గత విచారణ వేగిరం చేసినట్టుగా తెలిసింది. ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు? భీమారానికి చెందిన శ్రీనివాస్ గత నెల 26న ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్(ఆర్ఐసీయూ)లో చికిత్స అందించారు. అదేరోజు శ్రీనివాస్‌ను ఎలుక కొరికింది. వైద్యులు, సిబ్బంది ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అక్కడి విభాగాధిపతి, రోగి బాగోగులు చూసుకునే స్టాఫ్‌నర్సులతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్‌ను బృందం విచారించినట్లు సమాచారం. మళ్లీ గురువారం అదే పేషెంట్‌ను ఎలుక కొరికే వరకు ఎందుకు పట్టించుకోలేదని, విధుల్లో అలసత్వంగా ఉన్నారని బృందం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంజీఎంను శుక్రవారం సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఇప్పటికే అంతర్గత సమావేశంలో ఆర్ఐసీయూ ఇన్చార్జ్, నర్సింగ్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం చర్యలు తీసుకునేందుకు సంకేతమనే ఎంజీఎం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉండే ఆర్‌ఐసీయూలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగతా వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసే కాంట్రాక్టు సంస్థ ఏజిల్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెడతామని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించడంతో ఆ సంస్థపై చర్యలకు సంకేతాలిచ్చినట్లయ్యింది. ఇలా ఓ వైపు వైద్యులు, నర్సులు.. మరోవైపు కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటున్నారు. ఎలుకల కోసం వేట! ఎలుక కొరికిన ఘటనతో ఎంజీఎంకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం ఉగాది అయినప్పటికీ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు వార్డులను శుభ్రం చేయడం కనిపించింది. మురుగు కాల్వల్లో నీరు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలుకల కోసం మరిన్ని బోనులు ఏర్పాటు చేశారు. ఆయా బోనుల్లో చిక్కిన కొన్ని ఎలుకలను దూరంగా విడిచివచ్చినట్లు సిబ్బంది తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. 6 గంటల పాటు అలాగే..
సాక్షి, కరీంనగర్ టౌన్: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరోనాతో మృతిచెందగా మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా 6 గంటలపాటు వార్డులోనే ఉంచారని మృతుడి బంధువులు ఆరోపించారు. అంబులెన్స్‌లు లేవని వచ్చే వరకు వేచిచూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆస్పత్రి కరోనా పేషెంట్లతో నిండుతుండగా మృతదేహాలను ఇలా గంటల తరబడి వార్డులోనే ఉంచడంతో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురయ్యారు. -
ఆపరేషన్ వికటించి రోగి మృతి
చిత్తూరు, మదనపల్లె టౌన్: ఆపరేషన్ వికటిం చి కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టెకు చెందిన రైతు పోగల గంగయ్య కుమారుడు పి.వెంకటరమణ(60) మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె పట్టణంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. నెల రోజులుగా యూరిన్ పోసే సమయంలో మంట వస్తుండడంతో మదనపల్లె ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నాలుగు రోజుల క్రితం వచ్చాడు. అప్పటి వరకు అతను బాగానే ఆస్పత్రికి నడచుకుంటూ వచ్చాడు. ఒంటికిలో మంటగా ఉందని ఓపీలో ఉన్న డాక్టరుకు చూపించాడు. యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందని, ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. డాక్టర్ శనివారం రాత్రి ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్ కాస్త వికటించడంతో రోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి చేరడంతో డాక్టర్, అక్కడి సిబ్బంది తెలివిగా రోగిని తిరుపతికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆదివారం తిరుపతికి బయలుదేరగా వెంకటరమణ మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లనే వెంకటరమణ చనిపోయాడని వారు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మృతుడికి భార్య నాగమునెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై వెంకటరమణ మృతి విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం: ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్ డౌన్ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్.భీమేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు. -
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం: ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్ డౌన్ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్.భీమేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు. -
అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ, రోగి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న అంబులెన్స్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. దాంతో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ రామ సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనారోగ్యంగా ఉన్న రామ సుబ్బారెడ్డిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జిల్లాలోని ధన్వాడ మండలం పస్పులగేట్ వద్ద ఓ లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. -
వైద్యుడిని చితకబాదిన బంధువులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగి మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు రాణినగర్‌కు చెందిన దుర్గారావు కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. మృతదేహంతో సహా ధర్నా చేస్తూ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వాదనలు దిగారు. అనంతరం వైద్యుడు శ్యామ్ సుందర్‌పై దాడికి యత్నించారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే దుర్గారావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకోవటంతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులతో చర్చిలు జరపటంతో వారు ఆందోళన విరమించారు.