ఆపదలో మనుషుల ప్రాణాల కాపాడే 108 వాహనమే ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ధనాపూర్ ప్రాంతానికి చెందిన తెజియా(40) పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో, ఆందోళన చెందిన తెజియా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ తజియాను తీసుకుని సమీప ఆసుపత్రికి బయలుదేరింది. కాగా, కొంత దూరం వెళ్లాక రత్లం రోడ్ టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా సడెన్‌గా అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో, అంబులెన్స్ ఎందుకు ఆగిపోయిందని తజియా కుటుంబ సభ్యులు ఆగడంతో డీజిల్ అయిపోయిందని చెప్పాడు.
ఈ క్రమంలో తజియా ప్రాణాలు కాపాడేందకు రోగి కుమార్తె, అల్లుడు అంబులెన్స్‌ను ఒక కిలోమీటరు దూరం నెట్టారు. పెట్రోల్ బంక్ రాగానే బాధితులు అంబులెన్స్‌లో రూ.500 కొట్టించినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబులెన్స్ స్టార్ట్ కాకపోవడంతో మరో అంబులెన్స్‌కు ఫోన్ చేయగా గంట తర్వాత వచ్చిందనన్నారు. దీంతో, హుటాహుటిన తజియాను ఆసుపత్రికి తరలించగా.. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో తజియా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ అంబులెన్స్ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో వైద్యశాఖ అధికారులు చర్యలకు దిగారు. ఈ ఘటనపై సీఎంహెచ్‌వో స్పందిస్తూ.. విచారణ ప్రారంభించాము. తాము బాధితుడి బంధువులను కలవనున్నట్టు తెలిపారు. 108ని ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యత వారిదే. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.
#WATCH #Ambulance ran out of #diesel in #Banswara, patient died on the road.
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 26, 2022
◆ Daughter-son-in-law pushed the ambulance for 1 KM to save #life. #Rajasthan #Banswara #Ambulance #RajasthanNews #NewsUpdates #Rajasthan #Banswara #Jaipur pic.twitter.com/17lJ3LEuoN
Comments
Please login to add a commentAdd a comment