హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 17 రోజు ల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన శనివారం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని కార్వాన్‌కు చెందిన కోరని బాగ్యలక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త చి న్నా ఆమెను లంగర్‌హౌజ్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీం తో ఆమెను ఈ నెల 3న ఉస్మానియాకు తరలించగా, 5న అడ్మిట్ చేసుకున్నారు. బాగ్యలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ‘బలహీనంగా ఉంది. అడ్మిట్ వద్దు. సమయానికి తినిపించండి. బాగవుతుంది. మందు బిళ్లలు వేయడం మరవద్దు’అని చెప్పి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment