ఎంత నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ చేసి సూదిని కడుపులో మరిచిపోవడంతో.. | Tamil Nadu: Negligent Doctors Leave Needle In Patient Stomach | Sakshi
Sakshi News home page

ఎంత నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ చేసి సూదిని కడుపులో మరిచిపోవడంతో..

Published Wed, Dec 8 2021 6:21 PM | Last Updated on Wed, Dec 8 2021 8:05 PM

Tamil Nadu: Negligent Doctors Leave Needle In Patient Stomach - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నొప్పి విపరీతంగా ఉండడంతో మూడు రోజుల తర్వాత స్కాన్‌ చేయించుకున్నాడు.కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తిరిగి ఆపరేషన్‌ చేయాలని తెలిపారు.

తిరువొత్తియూరు: ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్న యువకుడి కడుపులో సూది మరచి కుట్లు వేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెన్నై పులియాంతోపు బీకే కాలనీకి చెందిన రంజిత్‌కుమార్‌ (28) కడుపులో ఏర్పడిన గాయానికి పట్టాలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేసుకున్నాడు. నొప్పి విపరీతంగా ఉండడంతో మూడు రోజుల తర్వాత స్కాన్‌ చేయించుకున్నాడు.

కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తిరిగి ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. దీనిని తిరస్కరించిన రంజిత్‌కుమార్‌ సోమవారం రాత్రి స్టాన్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఆపరేషన్‌ చేసి సూదిని తొలగించారు.

చదవండి: గతంలోనూ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్‌ ప్రమాదం.. ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement