సాక్షి,హైదరాబాద్: పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉదాత్త సంకల్పంతో బీఆర్‌ఎస్ 400పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(సెప్టెంబర్23) కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.
అయితే తాము ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను కూడా కాంగ్రెస్ సర్కారుకు సరిగా నడపడం చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. అనేక రకాల విష జ్వరాలతో నగరవాసులు నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన బస్తీ దవాఖానాలకే ఈ అసమర్ధ ప్రభుత్వంలో సుస్తీ చేసిందన్నారు.
ప్రజారోగ్యంపై మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో బీఆర్‌ఎస్ వేసిన కమిటీ సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
ఇదీ చదవండి: ఎల్‌వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్
Comments
Please login to add a commentAdd a comment