daily labours
-
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ బండరాయి పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. కురవి మండలం అయ్యగారిపల్లెలో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. లారీ లోడ్ నుంచి గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. కూలీ పనులు ముగించుకుని వాళ్లంతా ఇంటికి వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా చిన్నగూడురు మండలం మంగోళిగూడెం వాసులుగా తెలుస్తోంది. -
అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం
అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందినట్లు సమాచారం. పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవాళ్లలో మరొకరి మృతితో.. మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటన దర్గాహోన్నూరు ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారాయన. అంతేకాదు.. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారాయన. -
ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్ నాగలక్ష్మి
అనంతపురం (రాయదుర్గం/టౌన్) : ‘ఏమ్మా.. అంతా బాగున్నారా? ఉదయమే వచ్చేశాను. మీరు తెచ్చుకున్న క్యారీ ఉందా? ఉంటే నాకూ కాస్త అన్నం పెట్టండి’ అంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కూలీలతో ఆప్యాయంగా మాట్లాడారు. బుధవారం ఆమె రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో పర్యటించారు. రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల, నాగిరెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మమేకమై..వారి సమస్యలను తెలుసుకున్నారు. వేపరాళ్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రాయదుర్గంలోని బీటీపీ, ముత్తరాసి లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించి..పురోగతిపై ఆరా తీశారు. తర్వాత గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం, అడిగుప్ప గ్రామాల పరిధిలో ఉపాధి పనులను పరిశీలించారు. శిరిగెదొడ్డి గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కూలీలతో మాట్లాడుతూ రూ.250 దినసరి కూలి అందేలా పనులు చేసుకోవాలని సూచించారు. ప్రతి పనీ నాణ్యతగా ఉండాలన్నారు. వేపరాళ్లలో రెండు వారాల వేతనం అందలేదని కూలీలు తెలపగా.. సత్వరమే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజూ రెండు లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మే 14 వరకు ఉన్న వేతనాలన్నీ జమ చేశామని, ఒకట్రెండు రోజుల్లో మిగిలినవీ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూలీలకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. సచివాలయాల్లో పౌర సేవలు మరింత మెరుగ్గా అందివ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ, ఆర్బీకే భవన నిర్మాణాలను పరిశీలించి.. పురోగతిపై డీఈ రామమోహన్‌రెడ్డితో ఆరా తీశారు. నెలాఖరులోపు గ్రౌండింగ్ చేయాలి.. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను నెలాఖరులోపరు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడు నెలాఖరులోగా కచ్చితంగా నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత హౌసింగ్, మున్సిపల్, సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, ఏపీడీ శంకర్, తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
అడ్డా కూలీలకు గడ్డు కాలం
చార్మినార్: కోవిడ్–19 వైరస్ ప్రభావం పాతబస్తీలోని అడ్డా కూలీలపై కూడా పడింది. సాధారణ రోజుల్లో అంతంత మాత్రంగా దొరికే కూలీ పనులు ప్రస్తుతం కోవిడ్ వైరస్ దెబ్బతో అడ్డా కూలీలను మరింత కుంగదీస్తోంది. రోజు పొద్దున్నే తిన్నా.. తినకపోయినా అడ్డాల మీదికి చేరుకునే రోజు వారి కూలీలకు గత వారం రోజులుగా పనులు దొరకడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం అడ్డాలకు చేరుకోవడం.. పనులు దొరక్కపోవడంతో నిరాశతో ఇళ్లకు చేరడం పరిపాటిగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ ప్రభావంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణం పనులు కూడా సన్న గిల్లాయి. అన్ని రకాల బిజినెస్‌లు దెబ్బతినడంతో ఆర్థిక లావాదేవీలు మందగించాయి. దీంతో గృహవసరాల కోసం మాత్రమే డబ్బును వినియోగించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు విద్యాసంస్థలతో పాటు జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలన్నింటినీ మూసి వేయడంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. విద్యార్థులకు పాఠశాలలు లేకపోవడంతో చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సిమెంట్, ఇసుక, కంకర అశించిన మేరకు అందుబాటులో లేకపోవడంతో గృహ నిర్మాణాలు చాలా వరకు కుంటుపడినట్లు బిల్డర్లు చెబుతున్నారు. దీంతో రోజు వారి అడ్డా కూలీలకు కూలీ పనులు దొరకడం గగనంగా మారింది. సొంతూరికి పయనం చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా తదితర నియోజకవర్గాల పరిధిలో డబీర్‌పురా, యాకుత్‌పురా, బడాబజార్, కోకాకీతట్టీ, లాల్‌దర్వాజ మోడ్, పురానాపూల్, బహదూర్‌పురా, తాడ్బన్, కిషన్‌బాగ్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఐఎస్ సదన్, యాదగిరి థియేటర్, ఎర్రకుంట, సంతోష్‌నగర్ వాటర్ ట్యాంక్, బార్కాస్ తదితర ప్రాంతాల్లో లేబర్ అడ్డాలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఈ లేబర్ అడ్డాలలో వందల సంఖ్య లో కూలీలు పనుల కోసం వేచి ఉంటారు. ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు కూలీ పను లు దొరుకుతాయాఅనిఆశగా ఎదురు చూస్తారు. వారంరోజులుగా కోవిడ్ టెన్షన్‌తో పనులుదొరక డం లేదు. దీంతో రోజుల తరబడి పస్తులుండ లేక సొంత ఊర్లకు వెళుతున్నారు. సొంత ఊర్ల కు వెళ్లలేని ఉన్న కొద్ది మందికి కూడా పనులు దొరకని దుర్బర పరిస్థితులు పాతబస్తీలో నెలకొన్నాయి. దీంతో పాతబస్తీలోని లేబర్ అడ్డాలు కూలీలు లేక వెలవెలబోతున్నాయి. రేషన్ ద్వారా సరుకులు ఇవ్వాలి నగరంలో పరిస్థితులు ఈవిధంగానే ఉంటే తమ కుటుంబ సభ్యులు పస్తులుండే పరిస్థితులున్నాయని అడ్డా కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా పనులు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల అద్దెతో రోజు వారీ ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు గడుపుతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రేషన్ దుకాణాల ద్వారా రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయాలని కోరుతున్నారు. గుర్తింపు పొందిన అడ్డా కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని దినసరి వేతన కూలీల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రోజూ వస్తున్నా..పని దొరకుత లేదు వారం రోజులగా డబీర్‌పురాలోని లేబర్ అడ్డా కు వస్తున్నా. పని దొర కుత లేవు. ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు అడ్డాలో కూర్చొని సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికి పోతున్నా. ఏం చేయాలో తెలుస్త లేదు. కూలీ చేస్తేనే మాకు డబ్బులొస్తాయి. లేకపోతే రావు. రోజు వారీ ఇంటి ఖర్చుల కోసం ఏం చేయాలో తెలుస్తలేదు. మా చుట్టాలు సొంత ఊర్లకు వెళ్లి పోయిండ్రు. నేను కూడా పోతా. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – యాదమ్మ, డబీర్‌పురా -
నమ్మించి.. నట్టేటముంచి
శ్రీకాకుళం రూరల్ : వారంతా రోజువారీ కూలీలే. కష్టాన్ని నమ్ముకున్న నిరుపేదలే. దాచుకున్న సొమ్ముంతా ఊళ్లో ఉన్న నమ్మకస్తుడి చేతుల్లో పెట్టారు. మూడుంతలు చేసి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించాడు. రూ.కోట్ల కొద్దీ కలెక్షన్లు రావడంతో కొద్దిరోజులకే మకాం మార్చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అధికారపార్టీ నేత సాయంతో విశాఖలో తలదాచుకున్న మాయగాడిని పట్టుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం తీసుకొచ్చారు. మండలంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన కొర్ను రాజు తాపీమేస్త్రీగా చేసేవాడు. ఆయన వద్ద పనికి వచ్చే వారికి ‘పది రూపాయలు పెట్టుబడి పెట్టండి. దానికి మూడింతలు ఇస్తా’ అంటూ నమ్మబలికాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చీటిపాటలతో గ్రామస్తులందరినీ నమ్మించాడు. మూడు నెలల వరకూ సజావుగానే ఈ చీటీపాట నిర్వహించాడు. ఒకటి మూడు రెట్లు ఇస్తానని అందరికీ చెప్పడంతో స్థానికులేగాక చుట్టుపక్కల గ్రామాలైన కిష్టప్పపేట, మామిడివలస, సింగుపురం, బైరి గ్రామస్తులు కూడా తమ వద్ద ఉన్న డబ్బులను రాజు చేతిల్లో ఫిక్స్డ్ డిపాజిట్లా పెట్టేశారు. ఇలా 100 నుంచి 150 మంది వద్ద నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసి.. ఏడాది క్రితం పరారయ్యాడు. బ్యాంకులకు టోకరా చదువు లేకపోయినా తనకున్న తెలివితేటలతో బ్యాంకులకే టోకరా వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. 50 సెంట్లు భూమిని బ్యాంకుకు పద్దుపెట్టి రూ.లక్షల్లో లోను తీసుకున్నాడు. దీనిని కట్టేందుకు బ్యాంకు అధికారులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేయడంతో ఆ భూమిని మూడో వ్యక్తికి అమ్మి బ్యాంకు లోను కట్టినట్లు సమాచారం. దీంతో పాటు గ్రామంలోని మిగిలిన ఆస్తిపాస్తులు అమ్మి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నాడు. మాటువేసి పట్టుకున్న గ్రామస్తులు తన దగ్గర బంధువుతో విజయవాడలోని ఓ కనస్ట్రక్షన్ బిల్డింగ్ పనిలో రాజు తాపిమేస్త్రీగా చేరాడు. తరచూ భార్యతో ఫోన్లో మాట్లాడేవాడు. కిష్టప్పపేట గ్రామస్తులంతా వెళ్లి రాజు ఆచూకీ అడిగినా.. భార్య తెలీదంటూ సమాధానం చెప్పేదని బాధితులు తెలిపారు. ఒక దశలో వ్యక్తిగత పని మీద భార్య స్వస్థలమైన ఎచ్చెర్ల వచ్చేందుకు రాజు విజయవాడ నుంచి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కిష్టప్పపేట గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ముందస్తుగా మాటువేసి రెండు రోజులు క్రితం పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. మాటమాటకో మార్పు ఈ విషయం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. దీంతో బాధితులందరూ పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గంటగంటకో మాట చెబుతున్నట్లు సమాచారం. ఒకసారి స్టాక్ మార్కెట్లో పెట్టానని.. ఇంకోసారి విశాఖలోని ఓ వ్యక్తి వద్ద రూ.25లక్షలు వడ్డీకి ఇచ్చానని పొంతలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను నా కొడుకు చదువు నిమిత్తం రూ.90వేలు దాచిపెట్టా. గ్రామంలో అందరి ముందు నమ్మకంతో ఉండేవాడు. ఎక్కడికీ వెళ్లిపోడన్న ఆశతో ఆయన దగ్గరే దాచాను. ఇలా ముంచేస్తాడనుకోలేదు. – గుండ సూర్యనారాయణ, కిష్టప్పపేట కష్టమంతా చేతిలో పెట్టాను కష్టపడిన సొమ్మంతా తాపీమేస్త్రి చేతిలో పెట్డా. ఆయన చెప్పిన మాటలే నమ్మాను. సుమారు రూ.లక్ష 50వేలు చిన్న కూతురి పెళ్లి కోసం దాచి పెట్టాను. ఇలా మోసం చేస్తాడనుకోలేదు. – కొరికాన మల్లమ్మ, కిష్టప్పపేట అన్నింటిలోను మోసపోతున్నాం మొన్న అగ్రిగోల్డ్‌లో లక్షలు కట్టి మోసపోయాం. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి చేతిలో పెట్టి మరింత అన్యాయానికి గురయ్యాం. పైసాపైసా కూడబెట్టి ఊళ్లో వ్యక్తి చేతిలో పెడితే ఇంత మోసం చేస్తాడనుకోలేదు. కూలీనాలీ చేసుకొని దాచుకున్న రూ.1.50లక్షలు కాజేశాడు. – అరసవల్లి ఏకాసి, గ్రామస్తురాలు -
వలసల నివారణకు కసరత్తు
ఆలస్యంగా మేల్కొన్న అధికారులు జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు కరువు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి బోరు బావుల చుట్టూ ఇంకుడు గుంతలు నీటి సౌకర్యం ఉన్న చోట్ల మల్బరీ, గడ్డి పెంపకం కుటుంబానికి రోజుకు రూ.500 కూలి లభించేలా పనులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు సాక్షి, చిత్తూరు:జిల్లా అధికార యంత్రాంగం ఆలస్యంగా మేల్కొంది. కరువు దెబ్బకు జిల్లావ్యాప్తంగా వేలాది మంది పొట్ట చేతపట్టుకుని బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వలసలు వెళ్తున్నా ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు ఇప్పుడు దృష్టి సారిం చారు. వలసలపై అధ్యయానికి కమిటీ వేశారు. వలసలు నిరోధించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కొక్క కుటుంబానికి రోజుకు రూ.500 కూలి లభించేలా చర్యలు చేపడుతున్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితి నెలకొంది. బోరు బావులు ఎండిపోయాయి. పంటల సాగు 50 శాతానికి పడిపోయింది. సాగైన పంటలు సైతం నీళ్లు లేక ఎండిపోయాయి. ఉపాధి లేక జిల్లాలోని తంబళ్లపల్లె, కుప్పం, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, చిత్తూరుతో పాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది రైతులు, రైతు కూలీలు రోజూ బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. దీంతో వలసల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ఆలస్యంగా నడుం బిగించింది. వలసలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ ఏపీడీ గోపీచంద్ ఆధ్వర్యంలో ములకలచెరువు ఏపీడీ సాయిసుధీర్, వ్యవసాయశాఖ డీడీ యుగంధర్, పలమనేరు ఏడీ, ఇన్చార్జ్ డీపీఆర్వో మణిరామ్తో కూడిన బృందం గురువారం జిల్లా వాసులు అధికంగా వలసలు వెళ్తున్న బెంగళూరు ప్రాంతంలో పర్యటించింది. వలసలు వెళ్తున్న జిల్లా వాసులను సంప్రదించి వలసకు వెళ్లేందుకు దారి తీస్తున్న పరిస్థితులపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దీంతో పాటు జిల్లావ్యాప్తంగా కరువు ప్రాంతాల్లో పర్యటించి వలస వెళ్తున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. వలస నివారణకు వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. అనంతరం ఈ కమిటీ జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ డ్వామా ఇన్చార్జ్ పీడీ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో వలసల నివారణకు డ్వామా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రైతుల పొలాల్లోనే వారికి పనులు కల్పించనున్నారు. పొలాలను చదును చేసుకోవడం, గట్ల వెంట టేకు, ఎర్రచందనం తదితర మొక్కలను పెంచాలని నిర్ణయించారు. రైతుల బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. ఇక అంతో ఇంతో నీటి సౌకర్యమున్న ప్రాంతాల్లో మల్బరీ, గడ్డి సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఫామ్ఫాండ్స్ సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులన్నింటినీ ఉపాధి హామీలో చేసేందుకు, తద్వారా ఒక్కొక్క కుటుంబానికి రోజుకు రూ.500 తగ్గకుండా కూలీ గిట్టుబాటు అయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మరో రెండు వారాల్లోపు పెద్ద ఎత్తున ఉపాధి పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని చిత్తూరు క్లస్టర్ పరిధిలో 6,294 మందికి, పుత్తూరు 9వేలు, నగరి 6వేలు, శ్రీకాళహస్తి 6వేలు, తిరుపతి 5,500, చంద్రగిరి 9వేలు, పుంగనూరు 7,500, పీలేరు 7వేలు, కుప్పం 10వేలు, తంబళ్లపల్లె 5వేలు, మదనపల్లె 6వేలు, పలమనేరు 6 వేల చొప్పున జిల్లావ్యాప్తంగా రోజూ 80వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఈ ఏడాది రూ.293 కోట్ల పనులు కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.209 కోట్ల పనులు కల్పించారు. వలసల నివారణలో భాగంగా ఉపాధి పనులను పెద్ద ఎత్తున పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది ముగిసే లోగా రూ.300 కోట్లకు తగ్గకుండా పనులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డ్వామా ఇన్చార్జ్ పీడీ వేణుగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వలసల నివారణే లక్ష్యమన్నారు. -
పాము కాటుకు ఒకరు మృతి
విజయనగరం(బొండపల్లి): బొండపల్లి మండలం మరువాడ వద్ద ఆదివారం వేకువజామున ఓ పాము ముగ్గురిని కాటేసింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా పశ్చిమబెంగాల్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. వీరు మేఘనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలో పని చేయడానికి వచ్చారు. ఒరిస్సా నుంచి ఏపీవరకు పెద్దపెద్ద విద్యుత్ స్తంభాలు వేయడం ఈ కంపెనీ పని.