
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ బండరాయి పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. కురవి మండలం అయ్యగారిపల్లెలో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
లారీ లోడ్ నుంచి గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. కూలీ పనులు ముగించుకుని వాళ్లంతా ఇంటికి వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా చిన్నగూడురు మండలం మంగోళిగూడెం వాసులుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment