విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Published Mon, Jan 15 2024 8:42 AM

Mahabubabad Accident Four Members Of A Family Died - Sakshi

మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండగ వేళ వారంతా దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. పిల్లల కేరింతలతో ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి. ఒకే కుటుంబంలో నలుగులు అనంతలోకాలు చేరుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా!

Advertisement
 
Advertisement
 
Advertisement