హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్‌తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్‌మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేశారు.
మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment