విద్యుత్ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్‌పాత్ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్‌ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్ సీటీ (ఫెబల్ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్(7)తో కలిసి ఫెబల్ సిటీలోని ఈ–బ్లాక్ 12వ అంతస్తు 8వ నెంబర్ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. మోనీష్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్‌మెంట్‌లోని తోటి పిల్లలతో కలిసి లాన్‌లో ఆడుకునేవాడు.
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
Published Wed, Feb 13 2019 7:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement