Narsingi Police Station
-
యువ వైద్యుడి ప్రాణం తీసిన అతివేగం
మణికొండ: అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళా డాక్టర్ గాయాల పాలయ్యారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో వి.జస్వంత్ (25), భూమిక హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరు కారులో రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లికి ఓ వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున ఖానాపూర్ వద్ద రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న హోర్డింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న జస్వంత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న భూమికకు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కాలింగ్ బెల్ కొట్టి..ఇంట్లోకి చొరబడి..
మణికొండ: చైన్‌స్నాచర్లు రోడ్ల పక్కన ఏమరుపాటుగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడతారు. అందుకు భిన్నంగా ఇంట్లో ఉన్న మహిళలోని గొలుసును చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షాకోట్ గ్రామం సన్సిటీలోని విజయ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మంజుల నివసిస్తుంది. దీనికి సమీపంలోనే ఓ జిరాక్స్‌సెంటర్ నడుపుతుంది. ప్రతిరోజూ మాదిరిగానే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తిని కొద్ది సేపు పడుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే కాలింగ్ బెల్ పలుమార్లు మోగటంతో నిద్రమత్తులోనే వచ్చి డోరు తీసింది. మొహానికి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆమె గట్టిగా అరవంటంతో పక్కఫ్లాట్లోని వ్యక్తి అతని వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. జానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో లో ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.::రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది తెలిసిందే. మరోవైపు జానీ బాధితురాలు నిన్న స్టేట్ విమెన్ కమిషన్‌ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదును విచారణ స్వీకరించిన మహిళా కమిషన్.. జానీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే టైంలో బాధితురాలికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.ఇక.. లైంగిక దాడి కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల అండతో జానీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విమర్శలకు తలొగ్గి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయాడంటూ ప్రకటనలు ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు.ఈ అభియోగాల తర్వాత జానీ ఏ మీడియాతో మాట్లాడలేదు. మూడు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కొండపూర్లోని నివాసానికి తాళం వేసి ఉంది. తొలుత నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. ఆయన భార్య ఆచూకీ కూడా తెలియరావడం లేదు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీని ముమ్మరం చేశారు. కేసులో రెండ్రోజులకే ట్విస్ట్జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులుగా వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. .. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.ఈమేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు. అయితే.. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. ఇదీ చదవండి: జానీ వ్యవహారంపై పవన్ మౌనం -
దోపిడీ దొంగల బీభత్సం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్‌ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్‌షాకోట్‌కి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక(నరేష్) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్‌ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు. కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్లను డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్‌రెడ్డి(35)కి ఫోన్ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. శివరాజ్ ఆ తర్వాత దారి కాచి హత్య... ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్‌రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్‌లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటి పోలీసులపై దాడి జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్‌సింగ్.. కూకట్పల్లి సిక్ బస్తీలోని భగవాన్‌సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్ సింగ్ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్ను మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్ డీసీపీ సందీప్ గోనె, మాదాపూర్ ఎస్ఓటీ క్రై మ్ అడిషనల్ డీసీపీ నారాయణ, బాలానగర్ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
రాజేంద్రనగర్ కస్తూర్బా ఆశ్రమం నుంచి 14 మంది మహిళలు పరార్
-
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు.. 14 మంది మహిళలు పరార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 19 - 25 సంవత్సరాల వయసు గల మహిళలను కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా అనాథాశ్రమంలో చేర్పించారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఆశ్రమం నిర్వాహకులు నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య) -
ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. కేసుల నమోదు, స్టేషన్ల బెయిల్, భూవివాదాలు, సినిమా షూటింగ్ అనుమతులు.. ఇలా పోలీసుల అవసరం ఉన్న ప్రతీ చోట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏసీపీ, డీసీపీలూ తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటంతో బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు. ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నా రు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి ఠాణాలో ఇన్స్పెక్టర్, ఎస్ఐలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. రెండ్రోజుల క్రితమే ఓ నేరస్తునితో జట్టు కట్టి డబ్బులు వసూలు చేసిన సరూర్‌నగర్ ఎస్ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో పోస్టింగ్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. ►ఒక్క పోస్టింగ్ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి, అక్రమాలు బయటపడిన స్థానిక రాజకీయ నేతలు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రాజకీయ బలం ఉన్న ఇన్స్పెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా.. తమకున్న రాజకీయ అండదండలతో వేరే చోట లేదా వేరే కమి షనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీ గల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్హెచ్ఓ పోస్టింగ్ దక్కడంలేదు. ►పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చదవండి: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఓపిక ఉంటే అక్కడైనా రాయొచ్చు! సెటిల్మెంట్లలో.. భూ వివాదాలలో.. ►నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడంతో నేరస్తులతో దోస్తీ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్స్పెక్టర్లు, సెక్టార్ ఎస్ఐలు కాసులు దండుకుంటున్నారు. ►అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కె. లక్ష్మణ్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ►గతంలో వీరిద్దరిపై పలు భూ వివాదాలలో సెంటిల్మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దోస్తీ కట్టి.. దొరికిపోయి.. ►రెండు రోజుల క్రితమే సరూర్‌నగర్ ఎస్ఐ బి.సైదులును రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో సైదులుకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ►ఎస్ఐ కుటుంబంతో సహా కలిసి విజయవాడ విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను నేరస్తుడే భరించాడు. ఆయా బిల్లులన్నీ భద్రపరుచుకున్నాడు. ►తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్ఐతో దిగిన ఫొటోలు, హోటల్ బిల్లులు తదితర ఆధారాలన్నీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు. ‘సమర్పించు’కోకపోతే అనుమతులివ్వరు.. ►సినిమా షూటింగ్‌లకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే వారికి వసూళ్ల వేదికగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, సరైన పత్రాలు ఉన్నా.. పోలీసులకు ‘సమర్పించు’కోకపోతే అనుమతులు రావు. ఇలాంటి సంఘటనలు నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►ఆయా పీఎస్‌ల పరిధిలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అనుమతులు వచ్చినా, రాకపోయిన స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాల్సిందే. సెక్టార్ ఎస్ఐతో పాటు బీట్ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్ సిబ్బంది చేయి తడపనిదే సినిమా షూటింగ్ ముందుకు సాగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ►కేవలం లా అండ్ ఆర్డరే కాదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సదరు అధికారులకు తడపనిదే పని జరగని పరిస్థితి. రాయదుర్గం పరిధిలోకి వచ్చే ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సినిమా నిర్మాతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ కోసం లంచం.. గత నెల 21న స్టేషన్ బెయిల్ కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేశ్వరం పీఎస్ కానిస్టేబుల్ యాదయ్య. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు మరో అయిదుగురిపై భూ వివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదయింది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కానిస్టేబుల్ యాదయ్య (ఎస్ఐ రైటర్) రూ.25 లక్షల డిమాండ్ చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి రూ.20 లక్షలు, తనకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. -
‘నాన్న జాగ్రత్త.. టైమ్‌కి మందులు వేసుకో’
మణికొండ: ముందు రోజు రాత్రి ఫోన్లో నీ ఆరోగ్యం సరిగా చూసుకో.. మందులు సమయానికి వేసుకో అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిరిగిరిగడ్డలో చోటు చేసుకుంది. నార్సింగి సెక్టార్ ఎస్సై బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... జనగాం జిల్లా కుర్చెపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్ఎండీఏలో 8ఏళ్లుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గిరిగిరిగడ్డలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి తన తండ్రి వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్యం సరిగా చూసుకోవాలని సూచించి ఫోన్ పెట్టేశాడు. రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రాజేంద్రనగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట ప్రాంతానికి చెందిన చాంద్‌పాషా(42) మంచిరేవులలోని గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం విచారణ కేంద్రం వద్దకు వచ్చిన అతను రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే, అతనికి రివాల్వర్ ఎలా వచ్చింది.. అనే విషయంలో పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అతని డ్యూటీ అధికారి వద్ద రివాల్వర్ తీసుకొని ఆయన ముందే కాల్చుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. అయితే, గ్రేహౌండ్స్‌లోని కొంతమంది కానిస్టేబుళ్లకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో స్థానికంగానే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులోనే చికిత్స అందిస్తున్నారు. చాంద్‌పాషాకు సైతం ఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయమై ఇన్స్పెక్టర్ గంగాధర్‌ను వివరణ కోరగా.. అలాంటిది ఏమి లేదని, కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. -
తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్!
సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీస్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద గ్రే హౌండ్స్ క్యాంపస్‌లో ఓ కానిస్టేబుల్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలిస్ కానిస్టేబుల్ చాంద్ పాషా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యక్తిగత కారణాలతోనే చాంద్ పాషా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. (కరోనాపై పాట రాసిన.. దానికే బలైన నిస్సార్!) -
దొంగతనానికి వచ్చి.. దుర్మరణం చెందాడు..!
హైదరాబాద్ : దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి తప్పించుకునే యత్నంలో 3వ అంతస్తు నుంచి దూకి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన బాలాంజనేయులు అలియాస్ బాలు బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. పుప్పాలగూడ దుర్గా కాలనీ ప్రాంతంలోని రవీందర్ అనే వ్యక్తి వద్ద కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో తాను గతంలో పనిచేసిన రవీందర్ ఇంటి వద్దకు చోరీకి వచ్చాడు. ఆ సమయంలో రవీందర్ కుటుంబీకులు ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రిస్తున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చిన బాలాంజనేయులు ఆ ఇంటి తాళం విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లగా..అదే సమయంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి చూసి కేకలు వేశాడు. దీంతో బయటకు వచ్చిన బాలాంజనేయులు తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
-
ఆడుకుంటూ వెళ్లి.. స్తంభాన్ని పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫుట్‌పాత్ పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఈఎల్ సీటీ (ఫెబల్ సిటీ)లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన దివాకర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య, కుమారుడు మోనీష్(7)తో కలిసి ఫెబల్ సిటీలోని ఈ–బ్లాక్ 12వ అంతస్తు 8వ నెంబర్ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. మోనీష్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్మెంట్లోని తోటి పిల్లలతో కలిసి లాన్లో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకోవడానికి కిందకు వచ్చాడు. ఈ క్రమంలో ఆడుతూ ఆడుతూ వెళ్లి ఫుట్‌పాత్ పక్కనే ఉన్న వీధిదీపం స్తంభాన్ని పట్టుకున్నాడు. దాని కింది భాగంలో విద్యుత్ వైరు పాడై ఉండటంతో స్తంభానికి కరెంటు సరఫరా అవుతోంది. దీంతో మోనీష్ విద్యుత్ఘాతానికి గురై నిమిషంపాటు అలాగే ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోపాటు వాకింగ్ చేస్తున్నవారు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. నిమిషం తర్వాత మోనీష్ కింద పడిపోయాడు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. బిల్డర్‌తో పాటు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పీబీఈఎల్ సిటీ నిర్వాహకులు నివారణ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న భూగర్భ కేబుల్ వైర్లకు టేపులు చుట్టారు. స్తంభం వద్దకు వెళ్తూ... విద్యుత్ఘాతానికి గురై అలాగే ఉండిపోయిన మోనీష్ పోస్టుమార్టానికి తండ్రి ససేమిరా... మోనీష్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులు సోమవారం రాత్రే తమ స్వస్థలం చెన్నై తీసుకెళ్లారు. అయితే, ఇక్కడ కేసు నమోదు చేయడానికి పోస్టుమార్టం నివే దిక అవసరం కావడంతో పోలీసులు మోనీష్ తండ్రి దివాకర్‌ను సంప్రదించారు. అయితే, తన కుమారుడికి పోస్టుమార్టం చేయించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు దివాకర్‌తో మాట్లాడి ఒప్పించారు. అనంతరం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఐదు రోజుల్లో వస్తుందని వెల్లడించారు. ఈ కేసులో బిల్డర్, అసోసియేషన్, విద్యుత్ సరఫరా కాంట్రాక్టర్‌పై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. -
ఘోరం.. కరెంట్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: నగరంలో నార్సింగి సమీపంలో పీబీఈఎల్ గేటెడ్ సోసైటీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల బాలుడు కాలనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మరణించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు బాలుడు ఆడుకుంటూ ల్యాంప్ పోస్ట్‌ను పట్టుకోవడంతో అండర్ గ్రౌండ్ వైర్లు తాకి షాక్‌కు గురయ్యాడు. అయితే బాలుడు విద్యుత్ షాక్ గురైనా సమయంలో చుట్టూ జనాలున్నా ఎవరూ గమనించలేదు. ఏ ఒక్కరూ చూసి స్పందించిన బాలుడు బతికేవాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలుడి తండ్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వారు చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడిని మృతదేహాన్ని కూడా అక్కడికి తరలించినట్లు సమాచారం. అయితే కనీసం బయట వ్యక్తులను కూడా అనుమతించిన పీబీఈఎల్ భద్రతా సిబ్బంది.. బాలుడి పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక ఈ పెబెల్ సిటీలో సుమారు 1300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటనతో ఈ నివాస సముదాయంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
రాజేంద్రనగర్: నార్సింగి పోలీసులతో పాటు గండిపేట మండల రెవెన్యూ అధికారులను ఓ ఫోన్ కాల్ ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు గండిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేశాడు. గండిపేట శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక శవాన్ని మూటలో కట్టి పూడ్చిపెట్టి వెళ్లారని సమాచారం అందించాడు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా ఎవరూ మృతి చెందలేదని తెలిపాడు. దీంతో కానిస్టేబుల్ విషయాన్ని ఇన్స్పెక్టర్కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ విషయాన్ని గండిపేట మండల తహసీల్దార్‌కు సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పోలీసులతో పాటు తహసీల్దార్, ఆర్ఐ శ్మశానవాటికలో పూడ్చిన స్థలం వద్దకు వెళ్లి గోతిని తీయడం ప్రారంభించారు. అనంతరం ఒక తెల్లటి వస్త్రం చుట్టిన మూట కనిపించింది. మూటను బయటకు తీసి చూడగా అందులో కుక్క శవం ఉంది. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. తిరిగి ఆ కుక్క శవాన్ని అలాగే పూడ్చిపెట్టారు. దాదాపు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. తాము పెంచుకుంటున్న కుక్క మృతి చెందడంతో యజమానులు దానిని తీసుకొచ్చి శ్మశానవాటికలో పూడ్డారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటిక నిర్వాహకుడికి సమాచారం అందించలేదు. -
కారు ఢీకొని ఆర్ఎంపీ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నార్సింగికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కొండయ్య(58) మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న కొండయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు
-
నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు
* అల్కాపురిలో టౌన్‌షిప్‌లోని అతడి నివాసం ఓ నరకకూపం * అనేక మంది బాలికలపై అకృత్యాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఇతడి డెన్‌లో నాలుగు హత్యలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైనవారిలో ఓ మైనర్ బాలికతోపాటు ఓ పసికందు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తేలింది. బాలికను కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపగా.. పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు తీశారు. కోర్టు అనుమతితో ఫర్హానా, అఫ్షాలను కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. నయీమ్‌కు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన టెక్ మధు.. నెలల రోజుల పిల్లల్ని సైతం తీసుకువచ్చి నయీమ్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అల్కాపురి టౌన్షిప్పై సోమవారం నార్సింగి పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడున్న 11 మంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది నయీమ్‌తో పాటు ఫర్హానా, అఫ్షాలతో ఎలాంటి సంబంధం లేనివారు ఉండటంతో వారిని సైదాబాద్, హైదర్షాకోట్ల్లోని శరణాలయాల్లో చేర్పించారు. వీరి నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఆ ఇంట్లో మొత్తం 24 మంది పిల్లలు ఉండే వారని గుర్తించారు. తమలో ఇద్దరిని ఇటీవలే ఓ మహిళ తీసుకువె ళ్లిందని చిన్నారులు బయటపెట్టారు. మిగిలిన వాళ్లు ఏమయ్యారనే కోణంపై దృష్టిపెట్టిన పోలీసు ఫర్హానా, అఫ్షాలను ఆ కోణంలో ప్రశ్నించారు. నయీమ్ కొందరు పిల్లలు, యువతులతో పాటు 16 ఏళ్ల లోపు బాలికల్నీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. బాలికలకు మత్తు మందు ఇస్తూ అకృత్యాలు.. నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నయీమ్ అనుచరులు యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతో తీసుకువచ్చేవారు. వీరందరినీ తన ఆధీనంలోని తీసుకునే నయీమ్.. ఫర్హానాతో పాటు అఫ్షాలకు అప్పగించే వాడు. బాలికలకు మత్తమందులు ఇచ్చే నయీమ్ వారిపై శారీరక, మానసిక అకృత్యాలకు పాల్పడేవాడు. ఒప్పుకోని బాలికలను సున్నిత అవయవాలపై కొడుతూ హింసించేవాడు. నయీమ్ సమీప బంధువులు సైతం ఈ ఇంటికి వచ్చి వెళ్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఆపై గోవా, ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మేసేవాడు. నల్లగొండకు చెందిన ఓ బాలిక నయీమ్ అకృత్యాలను ఎదిరించింది. దీంతో నయీమ్, ఫర్హానా తదితరులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడి చేసి ఇంట్లోనే ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. ఆ దృశ్యం చూసిన మిగిలిన మైనర్లు కొన్ని రోజుల పాటు అన్నపానీయాలు సైతం ముట్టుకోలేదు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన బాలికలతో ఇంటిని శుభ్రం చేయించడంతో పాటు నయీమ్... ఆమె మృతదేహాన్ని వాహనంలో తీసుకువె ళ్లి మాయం చేశాడు. ఇలా చాలామంది మైనర్లపై అకృత్యాలు జరిగినట్టు ఫర్హానా, అఫ్షాలు పోలీసు కస్టడీలో వెల్లడించారు. దీంతో శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులను ఆ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు పలు కీలకాధారాలు, నమూనాలు సేకరించారు. ఈ హత్య, మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసులో హత్య తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లనూ చేర్చారు. కేసులో ఫర్హానా, అఫ్షాలతో పాటు నయీమ్ కుటుంబాన్నీ నిందితులుగా పేర్కొన్నారు. కస్టడీ పొడిగించండి.. ఫర్హానా, అఫ్షా మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు కస్టడీ ముగియడంతో శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఫర్హానా, అఫ్షాలకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఇప్పటికే చత్తీస్గడ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌ల్లో నయీమ్‌కు స్థిర, చరాస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు తాజాగా ఫర్హానా, ఆఫ్షాలు చెప్పిన విషయాలతో జబల్పూర్, ముంబైల్లోనూ భారీగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. భూవివాదంలో ఇద్దరి హత్య ముగ్గురు వ్యక్తులు కలిసి శంషాబాద్‌లో రూ.6 కోట్లకు ఓ చోట భూమి కొన్నారు. గొడవలు రావడంతో వీరిలో ఓ వ్యక్తిని మిగతా ఇద్దరు కలసి పక్కనపెట్టేశారు. దీంతో అతడు నయీమ్‌ను కలిసి.. మ్యాటర్ సెటిల్ చేస్తే ల్యాండ్‌లో 30% వాటా ఇస్తానని చెప్పాడు. దీంతో నయీమ్ వారిద్దరిని తన ఇంటికి పిలిపించుకొని సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత వారిని అల్కాపురిలోని తన ఇంటికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు. అనంతరం తనను మొదట కలిసి వ్యక్తికే 30% వాటా ఇచ్చి నయీమ్ ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. -
మంత్రి ఫాంహౌస్‌లో వాచ్‌మన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మంత్రి డీకే అరుణ ఫాంహౌస్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట శివారులో ఉన్న డీకే అరుణ ఫాంహౌస్‌లో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గం, ధారూరు మండలం, వేములపల్లిగ్రామానికి చెందిన శివరాముడు(26) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతను శుక్ర వారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్ పక్కనే పడిఉన్న అతని మృతదేహాన్ని అక్కడి సిబ్బంది కనుగొన్నారు. దీనిపై అదే ఫాంహౌస్‌లో పనిచేస్తున్న మంత్రి బంధువు డీకే పుష్పలత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి వెంటనే బంధువులకప్పగించారు. అయితే ఈ వివరాలేవీ మీడియాకు వెల్లడించకుండా తప్పించుకు తిరిగారు. మీడియా పట్టుపట్టడంతో రాత్రి 10గంటల సమయంలో కేసు వివరాలను అసంపూర్తిగా తెలిపారు.