
సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీస్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద గ్రే హౌండ్స్ క్యాంపస్‌లో ఓ కానిస్టేబుల్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలిస్ కానిస్టేబుల్ చాంద్ పాషా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యక్తిగత కారణాలతోనే చాంద్ పాషా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
(కరోనాపై పాట రాసిన.. దానికే బలైన నిస్సార్!)
Comments
Please login to add a commentAdd a comment