మంత్రి డీకే అరుణ ఫాంహౌస్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాక్షి, హైదరాబాద్: మంత్రి డీకే అరుణ ఫాంహౌస్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట శివారులో ఉన్న డీకే అరుణ ఫాంహౌస్‌లో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గం, ధారూరు మండలం, వేములపల్లిగ్రామానికి చెందిన శివరాముడు(26) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతను శుక్ర వారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్ పక్కనే పడిఉన్న అతని మృతదేహాన్ని అక్కడి సిబ్బంది కనుగొన్నారు.
దీనిపై అదే ఫాంహౌస్‌లో పనిచేస్తున్న మంత్రి బంధువు డీకే పుష్పలత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి వెంటనే బంధువులకప్పగించారు. అయితే ఈ వివరాలేవీ మీడియాకు వెల్లడించకుండా తప్పించుకు తిరిగారు. మీడియా పట్టుపట్టడంతో రాత్రి 10గంటల సమయంలో కేసు వివరాలను అసంపూర్తిగా తెలిపారు.