హైదరాబాద్: నగరంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు స్పెషల్‌డ్రైవ్ చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ధ్వంసమైన ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణతోపాటు ప్రధాన రహదారుల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా కొత్త ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేట వరకూ ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే సోమాజిగూడ ఈనాడు కార్యాలయం వద్దకు వచ్చేసరికి హైడ్రామా నడిచింది.
ఈనాడు ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూల్చడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు యత్నించారు. అయితే సదరు జీహెచ్‌ఎంసీ అధికారులను ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. అదే సమయంలో సాయంత్రం వరకూ తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఫుట్‌పాత్‌ను ఆక‍్రమించి ఈనాడు నిర‍్మాణాలు చేపట్టిందని జీహెచ్‌ఎంసీ అధికారి విశ్వజిత్ తెలిపారు. దాదాపు ఆరు అడుగుల మేర ఫుట్‌పాత్‌ను ఈనాడు ఆక్రమించిందన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటామని విశ్వజిత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment