ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు | One killed in road accident | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు

Published Thu, Oct 20 2016 1:08 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు - Sakshi

ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు

  •  యాచకుడు దుర్మరణం.. 
  • మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ పట్టివేత
  • నాయుడుపేటటౌ¯న్‌: ఫుట్‌పాత్‌పైకి ఒక్కసారిగా బొలేరో కారు దూసుకు రావడంతో గుర్తుతెలియని యాచకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. స్థానిక వినాయకుడి గుడి పక్కన రోడ్డు ఫుట్‌పాత్‌పై ఓయాకుడు కూర్చుని ఉన్నాడు. నాయుడుపేట వైపు నుంచి ఓ బొలేరో కారు అతివేగంగా వస్తూ ఒక్కసారిగా గుడి పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి దూసుకువచ్చింది. దాంతో అక్కడ కూర్చుని ఉన్న సుమారు 50 సంవత్సరాలకు పైగా వయస్సు ఓ యాచకుడు మృత్యువాతపడ్డాడు. బొలేరో కారు సిని ఫకీలో పైకి లేపి కూర్చుని ఉన్న వ్యక్తిపైకి నడపడంతో స్థానికులు గుర్తించి  సంఘటన స్థలం వద్దకు పరిగెత్తారు. అప్పటికే కారు నడుపుతున్న డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో తూగుతుండడాన్ని గుర్తించారు. బొలేరో వాహనం ఎంపీ షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన వాహనంగా గుర్తించారు. డ్రైవర్‌ పట్టణానికి చెందిన మాబాషాగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement