హత్య కేసులో అరెస్ట్‌.. విచారణలో షాకింగ్‌ నిజాలు.. | Mumbai: Man Assassinated Two People Sleeping Footpath Smashing Heads | Sakshi
Sakshi News home page

హత్య కేసులో అరెస్ట్‌.. విచారణలో షాకింగ్‌ నిజాలు.. పోలీసులకే చెమటలు

Published Sat, Oct 30 2021 5:15 PM | Last Updated on Sun, Oct 31 2021 7:48 AM

Mumbai: Man Assassinated Two People Sleeping Footpath Smashing Heads - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు

ముంబై: కొందరు కోపంతో హత్యలు చేస్తే, ఇంకొందరు క్షణికావేశంలో హత్యలు చేస్తారు. కానీ సైకోలు మాత్రం ఏ కారణం లేకపోయినా హత్యలు చేస్తుంటారు. తాజాగా ఓ సైకో 15 నిమిషాల తేడాలో ఇద్దరి తలలను పగలు కొట్టి చంపేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. కర్ణాటకాకు చెందిన సురేష్‌ శంకర్ గౌడ గత కొన్ని సంవత్సరాలుగా ముంబైలో చెత్త ఏరుకుంటూ జీవనం  కొనసాగిస్తున్నాడు.

ఈ నెల 23న జేజే మార్గ్‌లోని రోడ్డుపై వెళుతున్న అతడు పుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని చూశాడు. ఏమనుకున్నాడో ఆ వ్యక్తి తలను సిమెంటు​ ఇటుకతో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఆ ప్రాంత సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు సురేష్‌ను అరెస్ట్‌ చేసి విచారణ మొదలుపెట్టారో లేదో పోలీసులే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. కాగ పోలీసుల విచారణలో..  జేజే మార్గ్‌ హత్యకు 15 నిమిషాల ముందు బైకుల్లాలో అచ్చం అలాగే ఓ మనిషిని కొట్టి చంపానని చెప్పాడు.

అంతేకాదు.. 2015లో ఇలాంటి హత్య కేసులోనే అతడు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ వ్యక్తి ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడనే కారణాలు మాత్రం తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం జుడిషియల్‌ కస్టడీకి తరలించారు. దర్యాప్తులో భాగంగా గతంలో అతడు ఎన్ని హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకోవటానకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

చదవండి: ఈటింగ్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement