సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటిదాకా ఆక్రమణల తొలగింపుతో పాటు విపత్తుల నిర్వహణలో ప్రజలకు అండగా నిలుస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) విభాగం ఇక ప్రజా సదుపాయాలనూ కల్పించనుంది. పాదచారులు నడిచేందుకు చక్కటి ఫుట్‌పాత్‌లను నిర్ణీత ప్రమాణాల కనుగుణంగా నిర్మించనుంది. ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి అవసరమైన టెండర్ల నుంచి నిర్మాణం పూర్తిచేసే బాధ్యతలూ నిర్వహించనుంది. జీహెచ్‌ఎంసీలో ఈవీడీఎం కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి.. విభాగం డైరెక్టర్‌గా విశ్వజిత్ కంపాటిని ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక ప్రతి రెండో శనివారం వివిధ మార్గాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టడం తెలిసిందే. గత సంవత్సరం జూన్ 30 నుంచి ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్‌లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం విరామమిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ తిరిగి చేపట్టారు.
అలా.. ఇప్పటివరకు దాదాపు 15 వేల ఆక్రమణల్ని తొలగించారు. ఈ చర్యలకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమైంది. అయితే ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణలు తొలగించాక.. తిరిగి కొద్దిరోజులకే మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. దాంతోపాటు ఆక్రమణల తొలగింపు వల్ల ఏర్పడ్డ డెబ్రిస్ తదితరాలతో కూడా ప్రజలు నడవడానికి వీల్లేకుండా పోయింది. వీటిని సరిదిద్దేందుకు, డెబ్రిస్ తదితర వ్యర్థాలతో మిగిలిన వాటిని చక్కదిద్దేందుకు తిరిగి ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అందుకుగాను ఇంజినీరింగ్ విభాగం టెండర్లు పిలిచి..టెండర్లు పూర్తయ్యి, పనులు పూర్తయ్యేందుకు సమయం పడుతోంది. ఈలోగా తిరిగి ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఈ పరిస్థితిని నివారించడంతోపాటు.. ఫుట్‌పాత్‌లుప్రజలకు సదుపాయయోగ్యంగా, సులభంగా నడవడానికి అనువుగా ఉండాలని కమిషనర్ దానకిశోర్ భావించారు.
అందుకుగాను ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను వెంటనే నిర్మించేందుకు ఈవీడీఎంకే విభాగానికే బాధ్యతలుంటే మంచిదని భావించి, అప్పగించారు. ఫుట్‌ఫాత్‌లను ప్రస్తుతమున్న విధంగా కాకుండా ప్రజలకు సదుపాయంగా ఉండేలా.. నిర్ణీత ప్రమాణాలతో, చూడ చక్కగా, అందంగా ఉండాలని భావించిన ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ అందుకనుగుణంగా చర్యలకు శ్రీకారం చుట్టారు.ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ ఫుట్‌పాత్‌లని తెలిసేలా , అంతటా ఒకే నమూనాలో, ప్రజలకు సదుపాయంగా తగిన డిజైన్‌లతో ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు తగిన డిజైన్లు రూపొందించే పనిలో పడ్డారు. మెట్రోరైలు మార్గాల్లో మాదిరిగా జీహెచ్‌ఎంసీ ఫుట్‌పాత్‌లని తెలిసే విధంగా తగిన గ్రిల్స్, కెర్బ్‌స్టోన్స్‌తదితరమైనవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు విశ్వజిత్ తెలిపారు. డిజైన్లు పూర్తయ్యాక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మళ్లీ వెలసిన ‘అక్రమాల’పై చర్యలు..
ఆయా మార్గాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించిన ఈవీడీఎం..కొంతకాలం తర్వాత తిరిగి వెలసిన అక్రమాలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇదివరకు తొలగించిన ఆక్రమణల స్థానంలో హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలకు పాల్పడ్డ ‘ హేవ్‌మోర్’ ఐస్‌క్రీమ్, శ్రీహరి ఎన్‌క్లేవ్, లైఫ్‌స్పాన్ డెంటల్ హాస్పిటల్స్, నేచురల్‌బ్యూటీ సెలూన్, షాగున్ స్వీట్‌హౌస్ తదితరమైన వాటి ఆక్రమణల్ని తిరిగి తొలగించింది.
స్పెషల్ డ్రైవ్ సంఖ్య
తొలగించిన ఆక్రమణలు
1. 5034
2. 1829
3. 1174
4. 1695
5. 1134
6. 764
7. 805
8. 620
9. 989
10. 736
Comments
Please login to add a commentAdd a comment