
'రహస్యంగా పెళ్లి చేసుకోవాలని ఉంది'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ తన తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ బాటలో నడవాలనుకుంటుంది. వారిలాగే ఆమె కూడా రహస్యంగా వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాము దాదాపు 18 నెలలపాటు కలుసుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నామని డకోటా తాతబామ్మలు టిప్పీ, పీటర్ గ్రిఫిత్ తెలిపారు.
అలాగే చేసుకున్నామని డకోటా తల్లిదండ్రులు మిలానీ గ్రిఫిత్, డోన్ జాన్సన్ కూడా రహస్యంగా వివాహం చేసుకొని వచ్చి తమను ఆశ్యర్యంలో ముంచెత్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా తన వాళ్ల సాంప్రదాయాన్నే కొనసాగిస్తానని డకోటా జాన్సన్ చెప్పింది. ఒక వేళ తొలి ప్రయత్నంలో తాను అనుకుంది జరగకుంటే మరోసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తానని డకోటా తెలిపింది.