దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్‌లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే.
చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్‌లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు.
కాగా.. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment