
రణ్‌వీర్, దీపిక
‘పేరెంట్స్‌గా ఎప్పుడు ప్రమోట్ అవుతారు?’ అనే ప్రశ్నకు పెళ్లయినప్పట్నుంచి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వచ్చారు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఫైనల్‌గా తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ భార్యాభర్తలు గురువారం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. సెప్టెం బర్‌లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ హ్యాపీ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే పలువురు ప్రముఖులు రణ్‌వీర్–దీపికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్ చేశారు.
ఇక 2013లో ‘రామ్‌లీల’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణ్‌వీర్, దీపిక. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఆ తర్వాత ‘పద్మావత్’ కోసం రణ్‌వీర్–దీపిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల కాగా, అదే ఏడాది నవంబరులో రణ్‌వీర్, దీపిక ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment