ఎవరో ఈ అవ్వ..! | Photos looked like someone elderly | Sakshi
Sakshi News home page

ఎవరో ఈ అవ్వ..!

Published Thu, Mar 17 2016 12:19 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

ఎవరో ఈ అవ్వ..! - Sakshi

ఎవరో ఈ అవ్వ..!

బంజారాహిల్స్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు ఎవ రో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు... గత పది రోజు లుగా ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్ ఎదుట ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఆమెకు స్థానికులు ఆహారం అందిస్తున్నారు. అయి తే నానాటికి ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్త పుష్పలత ఆమెను యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంకు తరలించారు. ఈ వృద్ధురాలిని వివరాలకోసం ఆరా తీయగా తన పేరు ఎల్లమ్మ అని, తాను నిజామాబాద్‌కు చెందిన దానినని తనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు చెప్పింది. పదిరోజుల క్రితం తన కొడుకే ఇక్కడ వదిలేసి వెళ్లాడని తెలిపింది. వారికి భారమయ్యావని వదిలించుకున్నారా అంటే..అలాంటిదేమీ లేదని తన కొడుకులు మంచి వారని చెప్పుకొచ్చింది.

తిరిగి నిజామాబాద్ వెళ్తావా అని అధికారులు ప్రశ్నించగా తన కొడుకులే కష్టపడి ఇంత తింటున్నారు. వారికి భారం కాదల్చుకోలేదని పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకుంటూ చెప్పింది. పదిరోజులుగా ఆమె ఆలనాపాలన చూస్తున్న ఫుట్‌పాత్ వ్యాపారులు అధికారులు ఆమెను స్టేట్‌హోంకు తరలిస్తుండగా కంటనీరు పెట్టుకున్నా రు. ఆమె కూడా వారిని విడిచి వెళ్లలేక ఏడుస్తూ కూర్చోవడంతో ఉద్విగ్నవాతావరణం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement