
మల్కాజిగిరి: కుటుంబ సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మల్కాజిగిరి బృందావన్ కాలనీకి చెందిన కామిశెట్టి సాయిదాసు(65),విజయలక్షి్మ(60) దంపతులకు సంతానం లేదు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు.
ఈ నెల 26న తమ బంధువు పోతన శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లమని చెప్పారు. 27న ఉదయం అతను సాయిదాసు ఇంటికి వెళ్లి పిలిచినా పలకక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఆనంద్‌బాగ్‌లో నివాసముంటున్న సాయిదాసు సోదరుడు మెహర్ ఓంకార్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు చెక్!:.. 10 వారాల్లో 106 మంది అరెస్టు)