finacial help
-
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. అలీగఢ్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి? -
స్వయం సహాయక సంఘం ద్వారా ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో ఉపాధి
-
సచివాలయ వ్యవస్థ : పేదజనానికి ప్రగతిపథం
ప్రపంచ దేశాలతో సుస్థిర అభివృద్ధి గమనంలో పోటీ పడుతున్న భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని పరితపిస్తోంది. అధిక ఆదాయ స్థితిసాధనకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శక్తిమంతంగా పని చేస్తోంది. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో మునిగిపోయాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ వెల్లడించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పేదరికం తగ్గింపు రేటు సగానికి పైగా దిగింది. పోషకాహారం, శిశు, కౌమార దశ మరణాలు; ప్రసూతి ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల గణాంకాలను వినియోగించి నీతి ఆయోగ్ తాను ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ అనుసరించని పాలనా పద్ధతుల్ని జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాన్ని పొందవచ్చో తెలియజేసే వాలంటీరు వ్యవస్థ పేద ప్రజల వెంట నడుస్తోంది. అర్హులయిన లబ్దిదారులంతా నవరత్నాలతో పాటు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న మిగతా ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింతగా చేరువ చేసింది. దీంతో ప్రజాపాలనలో రెట్టింపు వేగం పెరిగింది. మానవ వనరుల సంపదకు పునాదివేయడానికి వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మూలస్తంభాలని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 67 శాతానికి పైగా ప్రజలు ఈ రంగంలో నిమగ్నమై జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సుస్థిర విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మంది సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’తో రబీ, ఖరీఫ్ పంటల్లో బాసటగా నిలుస్తుంది. పంటలు విఫలమయితే తదుపరి పంటపనులకు ముందుగానే రైతులకు బీమా అందిస్తోంది. పాడి, మత్స్య పరిశ్రమలకు తగిన సహకారం లభించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పరిశ్రమల వాటా పెరిగింది. ప్రభుత్వం స్వయం ఉపాధి, సాంప్రదాయ వృత్తుల నేత కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు తదితర చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణ సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం. ‘‘అందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నిజానికి నేను చేయలేనిది చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం. మీరు నా ప్రభుత్వం నుండి లబ్ది పొందితేనే నాకు ఓటు వేయండి అనే నినాదంతో రేపటి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాను. నాకు ప్రజలు అద్భుత ఫలితాలు అందిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’ అంటున్నారు ఆయన. పేద ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి, సంక్షేమ పాలన మీద ఆయనకున్న నమ్మకం ఇది. – జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, 95028 12920. -
దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ నిర్మాతకు అండగా నిలిచాడు స్టార్ హీరో సూర్య. అగ్ర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమిళ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కొంతకాలంగా ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం శికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆయనకు అండగా నిలిచారు. ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాదు మరింత సాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. చదవండి: లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా? అలాగే తమిళ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, కనీసం ఆయన చికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్బుక్లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే! కాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నట్లు ఆయన స్నేహితుడు తెలిపాడు. -
ప్రపంచానికి ఆర్థిక కష్టాలు.. భారత్ లో ప్రభావమెంత..?
-
గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
ప్రముఖ నటుడు రావు రమేశ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా రావు రమేశ్ పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్గా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మేకప్‌మ్యాన్ కుటుంబానికి రూ. 10లక్షల చెక్ అందించి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఏ అవసరం వచ్చిన తాను ఉన్నానని, వారికి తన సాయం ఎప్పడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక రావు రమేశ్ దయా హృదయం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి తమ వద్ద పనిచేసే కళాకారులను, కార్మికులను పెద్ద నటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మీరు స్ఫూర్తి అంటూ రావు రమేశ్‌ను కొనియాడుతున్నారు. కాగా అలనాటి సీనియర్ నటులు రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయనటుడిగా ఎలాంటి పాత్రల్లోనైన ఇట్టే ఒదిగిపోతూ ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇక తాజాగా తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి అభిమానులు మనసు గెలుచుకున్నారు ఆయన. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. -
దంపతుల ఆత్మహత్య
మల్కాజిగిరి: కుటుంబ సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మల్కాజిగిరి బృందావన్ కాలనీకి చెందిన కామిశెట్టి సాయిదాసు(65),విజయలక్షి్మ(60) దంపతులకు సంతానం లేదు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 26న తమ బంధువు పోతన శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లమని చెప్పారు. 27న ఉదయం అతను సాయిదాసు ఇంటికి వెళ్లి పిలిచినా పలకక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని కనిపించారు. ఆనంద్‌బాగ్‌లో నివాసముంటున్న సాయిదాసు సోదరుడు మెహర్ ఓంకార్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు చెక్!:.. 10 వారాల్లో 106 మంది అరెస్టు) -
మహిళల ఆర్ధిక స్థిరత్వంపై అవగాహన కల్పించిన నాట్స్
ఎడిసన్ న్యూ జెర్సీ: ఇల్లాలే ఇంటికి వెలుగు అనేది చాటి చెప్పేందుకు నాట్స్ నడుంబిగించింది. అతివలు ఆర్థిక స్థిరత్వం సాధించాలనేలక్ష్యంలో భాగంగా వారాంతాల్లో నాట్స్ వరుసగా మహిళల ఆర్థిక స్వావలంబనపై వెబినార్స్ నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన వెబినార్‌కి డునా ఎక్సోసియ(ఏడీఈ) విమెన్ ఎంపవర్మెంట్ సంస్థ నాయకురాలు, టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత, మహిళల ఆర్థిక స్థిరత్వం అనే అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. అసలు మహిళలు పొదుపు ఎలా ప్రారంభించాలి..? చిన్న మొత్తాలతోనే పెద్ద పెద్ద ఆర్ధిక లక్ష్యాలను ఎలా సాధించాలి..? రిటైర్మెంట్ సమయానికి ఆర్ధికంగా ఏ ఢోకా లేకుండా ఎలా చేసుకోవాలి..? పొదుపుచేసిన సొమ్మును ఎలా పెట్టుబడులకు మళ్లించాలి..? ఆర్ధిక అంశాలపై స్వల్పకాలిక లక్ష్యాలు ఎలా ఉండాలి...? దీర్ఘకాలికలక్ష్యాలు ఎలా ఉండాలనే అంశాలపై దుర్గా ప్రశాంతి గండి చక్కగా వివరించారు. క్రెడిట్ స్కోర్ ఎలా మేనేజ్చేసుకోవాలనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న మహిళల ఆర్థిక సందేహాలను నివృత్తి చేశారు. వారిలోసరికొత్త ఆర్థిక ఉత్సాహాన్ని నింపారు. ఈ వెబినార్‌కి మాధవి దొడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన కుటుంబాల్లో సంతోషాలకు కొదవ ఉండదనే భావనతోనే నాట్స్ మహిళల ఆర్థిక అక్షరాస్యతపై దృష్టిసారించిందని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ ఇక ముందు మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలుచేపడుతుందని ఆమె తెలిపారు. ఈ వెబినార్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన జయశ్రీ పెద్దిబొట్ల, జ్యోతి వనం, లక్ష్మి బొజ్జ, బిందు యలమంచిలి, పద్మజ నన్నపనేని, ఆషా వైకుంఠం, ఉమ మాకం, గీత గొల్లపూడిలను నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు. -
ఐటీ ఉద్యోగులకు అండ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో వేతనాల కోత ఉంటుందని చాలా మంది భావించారు. అయితే అందుకు భిన్నంగా కంపెనీలు ఏప్రిల్ నెలకుగాను పూర్తి స్థాయి వేతనాన్ని ఇవ్వనున్నాయి. మరి కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి బోనస్, వేతనాల పెంపు ప్రకటించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల బ్రాడ్‌బ్యాండ్ ఖర్చులను భరిస్తున్న సంస్థలూ ఉండడం విశేషం. ఇంకొన్ని కంపెనీలైతే ఇన్వర్టర్ల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. పదోన్నతులు ప్రకటించిన సంస్థలూ ఉన్నాయి. ఏదైతేనేం జీతాల కోత లేకపోవడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులకు పెద్ద ఊరట. మధ్య, పెద్ద తరహా కంపెనీల్లో పరిస్థితి ఇలా ఉంటే, సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలు, స్టార్టప్స్‌లో వేతనాల కోత ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఒక్క హైదరాబాద్‌లో ఐటీ రంగంలో 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. మీకు అండగా మేము.. ఈ కష్ట సమయంలో మేమున్నామంటూ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు భరోసా ఇస్తున్నాయి. బ్రాడ్రిడ్జ్ తన సిబ్బందికి పూర్తి వేతనంతోపాటు రూ.25,000 బోనస్ ఆఫర్ చేస్తోంది. ఫ్యాక్ట్‌సెట్ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్ ఖర్చులు, హెచ్‌సీఎల్ పూర్తి వేతనంతోసహా బ్రాడ్‌బ్యాండ్ ఖర్చులు, ఇన్వర్టర్ వ్యయం భరిస్తోంది. అలైట్–ఎన్జీఏ జీతాలను పెంచుతోంది. కాగ్నిజెంట్ తన అసోసియేట్ లెవెల్ ఉద్యోగులకు బేసిక్ సాలరీ మీద 25 శాతం జీతం హైక్ చేస్తోంది. అమెజాన్ జీతాల పెంపు, పదోన్నతులు ఇస్తోంది. యాక్సెంచర్ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.1,500, క్యాప్‌జెమిని పూర్తి వేతనం, బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.2,000 అందిస్తోంది. ఇన్వెస్కో వేతనంతోపాటు అదనంగా రూ.4,000 అలవెన్సు జమ చేస్తోంది. ఫినాక్ టెక్నాలజీస్ అలవెన్సు ప్రకటించింది. జీతాల కోత లేకుండా.. ఉద్యోగులకు జీతాల కోత లేకుండా.. పూర్తి స్థాయి వేతనం ఇస్తామంటూ పలు కంపెనీలు ప్రకటించాయి. వీటిలో జేపీ మోర్గాన్ ఛేస్, వెల్స్ ఫార్గో, బీఎన్వై మెలన్, బీఎన్పీ పారిబా, ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛ్చేంజ్, థామ్సన్ రాయిటర్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితర కంపెనీలు ఉన్నాయి. విప్రో ఉద్యోగులకు పదోన్నతులు, వేతనాల పెంపు లేనప్పటికీ అన్ని స్థాయిల ఉద్యోగులు విధుల్లో ఉన్నా, లేకున్నా పూర్తి వేతనం ఇస్తోంది. పైగా బ్రాడ్‌బ్యాండ్, పవర్ బిల్స్ ఖర్చులకుగాను రూ.1,500 జమ చేస్తోంది. టీసీఎస్ పూర్తి వేతనం ఇస్తోంది. ఉద్యోగుల కోత లేదని తెలిసింది. అయితే వేతనాల పెంపు ఇప్పట్లో లేదని సమాచారం. జెన్‌ప్యాక్ట్ సైతం టీసీఎస్ బాటలో ఉంది. ఈ ఏడాది జీతాల పెంపు, ప్రమోషన్లు లేవని సమాచారం. ఏప్రిల్ నెలకు పూర్తి వేతనం చెల్లిస్తోంది. కొత్త వ్యాపార అవకాశాలు.. కరోనాతో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అందుకు అనుగుణంగానే ఉన్న ఉద్యోగులను కాపాడుకుంటూ, భవిష్యత్తు అవసరాల కోసం నగదు నిల్వలను సమర్థంగా వినియోగించాలన్నది కంపెనీల భావన అని స్మార్ట్‌స్టెప్స్ కో–ఫౌండర్ లావణ్య కుమార్ నానబాల సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మధ్య, పెద్ద తరహా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సమర్థంగా మార్చివేశాయి. మరోవైపు లాక్‌డౌన్‌తో దేశీయ, విదేశీ క్లయింట్లు కొన్ని పనిచేయడం లేదు. దీంతో రావాల్సిన చెల్లింపులు జాప్యం జరగవచ్చు. అలా జరిగితే రానున్న కాలంలో సాలరీలలో కొంత శాతం వాయిదా పడే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కరోనా విపత్తుతో ఐటీ రంగంలోని సూక్ష్మ, చిన్న కంపెనీలు, స్టార్టప్స్ కుదేలవుతున్న పరిస్థితి. ఇవి ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయంతో నెట్టుకొస్తున్నవి. లాక్‌డౌన్‌తో ఆదాయం రాక పోగా సాలరీలు, అద్దె చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలన్నీ మార్చి నెల సాలరీల్లో భారీగా కోత పెట్టాయి. ఏప్రిల్ మాసానికి మొత్తంగా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
మేము సైతం...
విజయనగరం టౌన్: ఒకే దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత పోలీస్ శాఖలో పలు చోట్ల ఉద్యోగాలు చేపట్టిన వారందరూ ఏకమై ఈ ఏడాది తమ బ్యాచ్‌లో మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు వెళ్లి వారికి తామున్నామంటూ భరోసా కల్పించి ఆర్థికసాయం అందించారు. టూటౌన్లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కానిస్టేబుల్, విశాఖ గ్రేహౌండ్స్‌లో పని చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు వారి బ్యాచ్‌మేట్ కానిస్టేబుళ్లు ఆసరాగా నిలిచారు. టూటౌన్లో పని చేసి మృతి చెందిన జి.రామారావుతో పాటు శిక్షణ పొందిన 1995 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు తమ సహోద్యోగి మృతిని జీర్ణించుకోలేకపోయారు. తమ వంతుగా సాయమందించాలని భావించి రూ.50వేలను సేకరించి ఎస్పీ జి.పాలరాజు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వులో కానిస్టేబుల్‌గా పని చేస్తూ విశాఖ గ్రేహౌండ్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ టి.అశోక్ కుటుంబానికి 2009 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుళ్లు తమ వంతు సాయంగా రూ.లక్షా 65వేలను అశోక్ భార్య ఉషకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. వీటిలో లక్షా 50వేలను అశోక్ పిల్లల పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిగిలిన రూ.15వేలను తమ అవసరాలకు వినియోగించేందుకు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, ఏఆర్ డీఎస్పీ ఎ.హనుమంతు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ టి.త్రినాధ్, రూరల్ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు బివిజె.రాజు, వైవి.శేషు, ఆర్ఐ శ్రీహరిరావు, బ్యాచ్‌మేట్స్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎమ్విఆర్.సింహాచలం (రామా) తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్తాన్‌పై భారత్ సాయం కావాలి: ట్రంప్
వాషింగ్టన్: పూర్తి స్థాయి న్యూక్లియర్ వ్యవస్థ లేని పాకిస్థాన్ సమస్య గురించి ఇండియా తదితర దేశాల సాయాన్ని కోరుతున్నట్లు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియానా పోలీస్‌లోని టౌన్‌హాల్ లో మాట్లాడుతూ... పాకిస్తాన్ వంటి దేశాలతో ఎలా డీల్ చేస్తారనే ప్రశ్న అడగ్గా ట్రంప్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే నిజమైన సమస్య అని ఆయన అన్నారు. మొత్తం తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి. ఇది ఒకే ఒక్క పెద్ద సమస్య అని అన్నారు. పాకిస్తాన్‌తో కొద్దిపాటి సత్సంబంధాలు ఉన్నాయి. తాను వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌కు అమెరికా చాలాసార్లు ఆర్ధికంగా సాయం చేసింది. ఆ దేశ ప్రవర్తన మీద తర్వాతి పరిణామాలు, విపరిణామాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. భారత్, మరికొన్ని దేశాలు అమెరికాకు సాయం చేస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా చాలా దేశాల నుంచి ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సాయం చేసిందని, ఇక ముందు అలా జరగదని ట్రంప్ పేర్కొన్నారు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒబామా ప్రభుత్వం బిలియన్ డాలర్ల కొద్దీ పాక్‌కు సాయం చేయడాన్నిఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు 9/11 దాడుల తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన 25 బిలియన్ డాలర్ల సాయాన్ని ఆ దేశం తన మిలటరీ సారథ్యంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఊపిరి ఊది భారత్‌లో ప్రాణాంతక దాడులు చేసిందని అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన నేత మ్యాట్ సల్మాన్ వాదించారు. 180 మిలియన్ల జనాభా, 100కు పైగా న్యూక్లియర్ ఆయుధాలు, రాజకీయంగా వెనుకబడి టెర్రరిస్టులకు ఆవాసంగా మారిన పాకిస్తాన్ 2016-2017 సంవత్సరానికిగాను 742.2 మిలియన్ల యూఎస్ డాలర్ల సాయాన్ని కోరినట్టు, ఇవన్నీ దేశ భద్రతకే ఉపయోగపడాలని భారత్‌తో యుధ్దానికి కాదని మరో కాంగ్రెస్ నేత బ్రాడ్ షేర్మ్యాన్ చెప్పారు. -
సిద్దయ్య కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం
నల్గొండ: ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎస్.ఐ. సిద్దయ్య కుటుంబానికి మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ ప్రత్యేక ఆర్ధిక సహాయం ప్రకటించారు.. దేవరకొండ డివిజన్ పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో సేకరించిన విరాళాల మొత్తం రూ. 67,300/-ల నగదును ఎస్పీ తరఫున డీఎస్పీ చంద్రమోహన్, సి.సి.ఎస్. డీఎస్పీ సునితా మోహన్‌లు.. సిద్ధయ్య భార్య ధరణీషకు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సిద్దయ్య కుటుంబానికి పోలీస్ శాఖ తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ కావాలనే ఆకాంక్షను దరణీష వెలుబుచ్చడంతో ఆమేరకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందజేస్తామన్నారు.