![Suriya Financial Help to Tamil Producer VA Durai For Medical Treatment - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/suriya%201.jpg.webp?itok=OsTYF1HL)
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ నిర్మాతకు అండగా నిలిచాడు స్టార్ హీరో సూర్య. అగ్ర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమిళ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కొంతకాలంగా ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం శికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆయనకు అండగా నిలిచారు. ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాదు మరింత సాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.
చదవండి: లాక్‌డౌన్‌లో తీవ్ర ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా?
అలాగే తమిళ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, కనీసం ఆయన చికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే!
కాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్‌లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నట్లు ఆయన స్నేహితుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment