durai
-
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. కమల్ హాసన్ ఎమోషనల్
ప్రఖ్యాత సినీ దర్శకుడు పసిదురై (84).. వృద్ధప్య సమస్యల కారణంగా సోమవారం కొడైక్కానల్లో కన్నుమూశారు. 1974లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తమిళ చిత్రసీమలో రాణించారు. నిర్మాతగానూ పలు మూవీస్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 46 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన అసలు పేరు దురై. కాగా 1979 ఈయన దర్శకత్వం వహించిన పసి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి.. ఇలా మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రం పసి. తమిళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను, ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. దీంతో దురై పేరు పసిదురైగా మారిపోయింది. పసి చిత్రంతో పాటు అవళుమ్ పెణ్దానే, ఆశై 60 నాళ్, పావత్తిన్ సంబళం, ఒరువీడు ఒరు ఉలగం, కిళింజల్గళ్ లాంటి చిత్రాలని ఈయన తీశారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరో కమలహాసన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనని నటుడిగా మార్చడంలో మామ శీనివాసన్ (దురై) పాత్ర ఎంతో ఉందన్నారు. కాగా పసిదురైకి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. (ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) -
దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ నిర్మాతకు అండగా నిలిచాడు స్టార్ హీరో సూర్య. అగ్ర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమిళ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కొంతకాలంగా ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం శికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆయనకు అండగా నిలిచారు. ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాదు మరింత సాయం అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. చదవండి: లాక్డౌన్లో తీవ్ర ఆర్థిక కష్టాలు.. అంతలోనే లగ్జరీ హోం..!: రఘు ఇల్లు చూశారా? అలాగే తమిళ పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, కనీసం ఆయన చికిత్స కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్బుక్లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే! కాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ధీన స్థితిలో ఉన్నట్లు ఆయన స్నేహితుడు తెలిపాడు. -
పట్టపగలు తన్నుకున్న ఎస్సైలు.. సస్పెండ్
మదురై: సాధారణంగా గొడవలు జరిగితే చూసి వాటిని నిలువరించాల్సిన పోలీసులే పట్టపగలు జనాలందరు చూస్తుండగా తన్నుకున్నందుకు పోలీసు కమిషనర్ ఓ ఎస్సైని సస్పెండ్ చేశారు. ఇద్దరు ఎస్సైల మధ్య జరిగిన ఘర్షణలో దురై అనే ఎస్సైనే తప్పుచేసినట్లు నిజనిర్ధారణ కమిటీ తెలిపిన అనంతరం అతడిని సస్పెండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఎస్సైలు దురై, ప్రేమచంద్రన్ అనే ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు. పైగా ఒకే బ్యాచ్ లో ఉద్యోగంలో ఎంపికయ్యారు. అదీ కాకుండా తల్లా కుళం అనే పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, వారిద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాటా పెరిగింది. అనంతరం కనీసం చుట్టూ పబ్లిక్ చూస్తున్నారనే అంశాన్ని గమనించకుండానే అడ్డగోలుమాటలతో తిట్టుకున్నారు. అనంతరం రోడ్డుపైనే తన్నుకున్నారు. ఈ విషయం బాగా సంచలనం కావడంతో పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించి దురైదే ఈ విషయంలో తప్పుందని తేల్చారు. అనంతరం సస్పెండ్ వేటు వేశారు.