పట్టపగలు తన్నుకున్న ఎస్సైలు.. సస్పెండ్ | SI suspended following fight with colleague | Sakshi
Sakshi News home page

పట్టపగలు తన్నుకున్న ఎస్సైలు.. సస్పెండ్

Published Thu, Jan 21 2016 4:31 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

పట్టపగలు తన్నుకున్న ఎస్సైలు.. సస్పెండ్ - Sakshi

పట్టపగలు తన్నుకున్న ఎస్సైలు.. సస్పెండ్

మదురై: సాధారణంగా గొడవలు జరిగితే చూసి వాటిని నిలువరించాల్సిన పోలీసులే పట్టపగలు జనాలందరు చూస్తుండగా తన్నుకున్నందుకు పోలీసు కమిషనర్ ఓ ఎస్సైని సస్పెండ్ చేశారు. ఇద్దరు ఎస్సైల మధ్య జరిగిన ఘర్షణలో దురై అనే ఎస్సైనే తప్పుచేసినట్లు నిజనిర్ధారణ కమిటీ తెలిపిన అనంతరం అతడిని సస్పెండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఎస్సైలు దురై, ప్రేమచంద్రన్ అనే ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు. పైగా ఒకే బ్యాచ్ లో ఉద్యోగంలో ఎంపికయ్యారు.

అదీ కాకుండా తల్లా కుళం అనే పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, వారిద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాటా పెరిగింది. అనంతరం కనీసం చుట్టూ పబ్లిక్ చూస్తున్నారనే అంశాన్ని గమనించకుండానే అడ్డగోలుమాటలతో తిట్టుకున్నారు. అనంతరం రోడ్డుపైనే తన్నుకున్నారు. ఈ విషయం బాగా సంచలనం కావడంతో పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించి దురైదే ఈ విషయంలో తప్పుందని తేల్చారు. అనంతరం సస్పెండ్ వేటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement