ప్రఖ్యాత సినీ దర్శకుడు పసిదురై (84).. వృద్ధప్య సమస్యల కారణంగా సోమవారం కొడైక్కానల్‌లో కన్నుమూశారు. 1974లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తమిళ చిత్రసీమలో రాణించారు. నిర్మాతగానూ పలు మూవీస్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 46 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన అసలు పేరు దురై. కాగా 1979 ఈయన దర్శకత్వం వహించిన పసి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి.. ఇలా మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రం పసి. తమిళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను, ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. దీంతో దురై పేరు పసిదురైగా మారిపోయింది. పసి చిత్రంతో పాటు అవళుమ్ పెణ్‌దానే, ఆశై 60 నాళ్, పావత్తిన్ సంబళం, ఒరువీడు ఒరు ఉలగం, కిళింజల్‌గళ్ లాంటి చిత్రాలని ఈయన తీశారు.
ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరో కమలహాసన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనని నటుడిగా మార్చడంలో మామ శీనివాసన్ (దురై) పాత్ర ఎంతో ఉందన్నారు. కాగా పసిదురైకి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
(ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment