ప్రముఖ నటుడు రావు రమేశ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా రావు రమేశ్ పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్‌గా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మేకప్‌మ్యాన్ కుటుంబానికి రూ. 10లక్షల చెక్ అందించి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఏ అవసరం వచ్చిన తాను ఉన్నానని, వారికి తన సాయం ఎప్పడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక రావు రమేశ్ దయా హృదయం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి
తమ వద్ద పనిచేసే కళాకారులను, కార్మికులను పెద్ద నటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మీరు స్ఫూర్తి అంటూ రావు రమేశ్‌ను కొనియాడుతున్నారు. కాగా అలనాటి సీనియర్ నటులు రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయనటుడిగా ఎలాంటి పాత్రల్లోనైన ఇట్టే ఒదిగిపోతూ ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇక తాజాగా తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి అభిమానులు మనసు గెలుచుకున్నారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment