Makeup Man
-
సిగ్గనిపించట్లేదా? అని మేకప్ మెన్ ముఖం మీదే..: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మొదట్లో బుల్లితెరపై నటిగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే! రామాయణ్, విరుధ్: హర్ రిష్తా ఏక్ కురుక్షేత్ర, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్, క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో మేకప్‌మెన్ తనను అవమానించాడట. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ మొదటి ఏడాది నాకు రోజుకు రూ.1800 ఇచ్చారు. అప్పటికింకా నాకు సొంతంగా కారు కూడా లేదు. జుబిన్‌ను పెళ్లాడాక మాకిద్దరికీ కలిపి రూ.30,000 దాకా వచ్చేవి. అయినా సరే నేను ఆటోలోనే సెట్స్‌కు వెళ్లేదాన్ని. ఓ రోజు నా మేకప్ మెన్.. నేను రోజూ కారులో వస్తున్నా, మీరిలా ఆటోలో వస్తున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? అని ముఖం మీదే అడిగాడు. సొంతంగా ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని చెప్పాడు. అప్పుడు నాకెంతో అవమానంగా అనిపించింది. మరోవైపు సీరియల్ సెట్లో ఎటువండి కూల్‌డ్రింక్స్, ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఎందుకంటే ఆ ఫుడ్ అక్కడున్న వస్తువులపై పడితే శుభ్రం చేయడం కష్టం అవుతుందని యూనిట్ బాధ! అందుకే ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే సెట్ నుంచి బయటకు వచ్చి ఛాయ్ ఆస్వాదించేదాన్ని' అని చెప్పుకొచ్చారు. ఇకపోతే క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్లో ఆమె తులసి విరాణిగా నటించారు. కాగా స్మృతి ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
ప్రముఖ నటుడు రావు రమేశ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా రావు రమేశ్ పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్గా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మేకప్‌మ్యాన్ కుటుంబానికి రూ. 10లక్షల చెక్ అందించి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఏ అవసరం వచ్చిన తాను ఉన్నానని, వారికి తన సాయం ఎప్పడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక రావు రమేశ్ దయా హృదయం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి తమ వద్ద పనిచేసే కళాకారులను, కార్మికులను పెద్ద నటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మీరు స్ఫూర్తి అంటూ రావు రమేశ్‌ను కొనియాడుతున్నారు. కాగా అలనాటి సీనియర్ నటులు రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయనటుడిగా ఎలాంటి పాత్రల్లోనైన ఇట్టే ఒదిగిపోతూ ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇక తాజాగా తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి అభిమానులు మనసు గెలుచుకున్నారు ఆయన. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. -
సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్
వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా వెరవక.. లక్ష్యం వైపు అడుగులు వేశారు. సన్నివేశం ఏదైనా అందుకు తగ్గ వేషం వేసి అందరినీ అలరిస్తున్న వారు కొందరు.. తమదైన కళతో నటీనటుల మోముకు అందాలు అద్దుతూ సంపూర్ణత్వాన్ని తెస్తున్న వారు మరొకరు. చలనచిత్ర రంగంలో రాణిస్తున్న సీమ బిడ్డల గురించి ప్రత్యేక కథనం.. మేకప్ బాద్షా.. జమ్మలమడుగు (వైఎస్సార్ కడప): మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన గోవిందపల్లె రోషన్ మహబూబ్‌బాషా సినిమా రంగంలో మేకప్‌మెన్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇతని సినీరంగ ప్రవేశం ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో చదువు వంటబట్టకపోవడంతో మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్న తన మామ గఫూర్ వద్ద పని నేర్చుకుందామని పులివెందుల వెళ్లాడు. రెండేళ్లపాటు అక్కడ పని నేర్చుకున్నాడు. ఆ సమయంలో పులివెందులకు చెందిన రమణబాబు అనే వ్యక్తి మద్రాసు నుంచి కొందరు సినీ నటులను పిలిపించి పులివెందులలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ సినిమా రంగానికి చెందిన వారిని పరిచయం చేసుకుని వారి వెంట 1983లో మద్రాసు వెళ్లాడు. తొలుత నటుడు రంగనాథ్ వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఏఎం రత్నం, విజయశాంతి వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశాడు. దేవాలయం, వందేమాతరం, అరుణ కిరణం తదితర సినిమాల్లో విజయశాంతికి మేకప్ వేశారు. ముత్యాల సుబ్బయ్య ప్రోత్సాహంతో.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు చీఫ్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. అందులో ప్రధానంగా పవన్‌కల్యాణ్‌తో నిర్మించిన గోకులంలో సీత, ఒకేమాట, దీవించండి, మామగారు తదితర సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశారు. బాలకృష్ణతో మహబూబ్‌బాషా.. సుమన్‌కు మేకప్ వేస్తున్న మహబూబ్‌బాషా (ఫైల్) బాలకృష్ణకు సైతం బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఆదిత్య 369, భైరవద్వీపం, పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరుగబడ్డ తెలుగుబిడ్డ, అఖండ సినిమాలలో అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. నటుడు రంగనాథ్‌తో ప్రారంభించిన మేకప్‌మెన్ ప్రస్థానంలో మొత్తం 250 సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశానని మహబూబ్‌బాషా తెలిపాడు. ప్రధానంగా బాలకృష్ణ, చిరంజీవి, సుమన్, విజయశాంతి వంటి ప్రముఖ నటీనటుల వద్ద మేకప్‌మెన్‌గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతున్నాడు. పోలీసు పాత్రలో దావూద్ పోలీసు పాత్ర.. దావూద్ ప్రత్యేకత ప్రొద్దుటూరు: ప్రముఖ హీరోలు నటించిన సినిమాల్లో, అన్ని తెలుగు ఛానళ్లలో వస్తున్న సీరియల్స్‌లో నటిస్తున్న నటుడు దావూద్ ప్రొద్దుటూరుకు చెందిన వాడు. ఈయన ఇప్పటి వరకు సుమారు 60 సినిమాలు, 100కు పైగా సీరియల్లలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుసేన్ మసీదు వీధికి చెందిన మహమూద్, అఫ్తాబ్‌ల కుమారుడు దావూద్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నాడు. 2011లో కడప మదీనా ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లి చాలా కాలం ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ► 2013లో రిలీజైన చిరంజీవి సినిమా ఖైదీనంబర్ 150లో దుబాయి కూలి పాత్రలో దావూద్ రాణించాడు. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానున్న చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, హీరో ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాలో సీఐ పాత్రలో, సుధీర్‌బాబు హీరోగా భవ్యా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ఎస్ఐ పాత్రలో, నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న కుమారి శ్రీమతి సినిమాలో బ్యాంకు ఆఫీసర్ పాత్రలో దావూద్ నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ► తాజాగా విడుదలైన విరాట పర్వం సినిమాలో మఫ్టీ పోలీసు పాత్రలో, శేఖర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, శ్యాంసింగరాయ్లో కానిస్టేబుల్ పాత్రలో, ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ పోలీసు పాత్రలో, రిపబ్లిక్ సినిమాలో రిపోర్టర్‌గా, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో జైలర్‌గా, శ్రీకారం సినిమాలో మేనేజర్‌గా నటించాడు. ► ప్రముఖ తెలుగు ఛానళ్లలో వస్తున్న ఊహలు గుసగుసలాడే, సూర్యకాంతం, జానకి కలగనలేదు, వైదేహి పరిణయం, మౌనపోరాటం తదితర సీరియల్స్‌లో పలు పాత్రలు దావూద్ పోషిస్తున్నాడు. హీరో, హీరోయిన్లకు సీన్ వివరిస్తున్న డైరెక్టర్, తదితరులు శభాష్.. మహేష్ పులివెందుల రూరల్: పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన మహేష్ గాయకుడిగా, నటుడిగా సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. బాబయ్య, ఇమాంబిల కుమారుడు మహేష్. డిప్లొమా పూర్తి చేసిన ఈ యువకుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్ చానెళ్లు, సీరియళ్లలో పాటలు పాడుతూ, నటిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఇతను 25 లఘుచిత్రాలు, 30 సీరియల్స్‌తోపాటు స్పైడర్, నేనే రాజు – నేనే మంత్రి, నేను లోకల్, ద్వారక, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలలో చిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపాడు. సినిమా రంగంలో నటుడిగా స్థిరపడాలనేదే నా కోరిక’ అంటున్న ఈ యువ నటుడు మరింతగా రాణించాలనేదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష. వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్ మళ్లీ వచ్చాడు! కడప సిటీ: హాస్యనటుడిగా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ తనువు చాలించి రెండేళ్లకు పైగా అయింది. అయితే అదే ముఖ కవళికలు, పోలికలతో కడపకు చెందిన వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్‌ను మరిపిస్తున్నాడు. జూనియర్ వేణుమాధవ్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం శాంతకుమార్ దర్శకత్వంలో సాయికుమార్ హీరోగా నిర్మిస్తున్న నాతో నేను అనే సినిమాలో హాస్యనటుడిగా ప్రముఖ నటుడు భద్రం, సాయిశ్రీనివాస్‌ల సరసన నటిస్తున్నాడు. తొలుత టిక్‌టాక్ షోలలో కామెడీ సీన్లు చేసి యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. అచ్చం వేణుమాధవ్ లాగే ఉన్నాడని కొన్ని ఛానళ్లు గ్రహించి టీవీ షోలలో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సినీ నటులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులతో హైదరాబాదులో ప్రముఖ ఛానల్లో షో నిర్వహించారు. ఆ షోలో ప్రవీణ్‌కుమార్ పాల్గొని అచ్చం వేణుమాధవ్‌లా హావభావాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. కుటుంబ నేపథ్యం.. కడప విశ్వనాథపురానికి చెందిన వారం సుబ్బరాయుడు, శ్యామలాదేవి దంపతుల రెండో కుమారుడు వారం ప్రవీణ్‌కుమార్. ఇతను ఎంఏ బీఈడీ చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ‘నేను వేణుమాధవ్ పోలికలతో ఉండడం నిజంగా నా అదృష్టమని, దాంతోనే నాకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం దక్కుతోందని’ తెలిపాడు. తన సోదరి, బావ, సతీమణి సహకారంతోనే తాను రాణిస్తున్నాని చెప్పాడు. సినిమాల్లో అవకాశం రావడానికి ఆయన పోలికలు ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. కడపకు చెందిన ఈ జూనియర్ వేణుమాధవ్ భవిష్యత్తులో తన నటనా చాతుర్యంతో అందరి మన్ననలు పొందాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. -
టాలీవుడ్ ప్రముఖ మేకప్ మ్యాన్ కన్నుమూత
ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది సినీ ప్రముఖులు అసువులు బాసారు. తాజాగా ప్రముఖ తెలుగు మేకప్ మ్యాన్ గంగాధర కరోనాతో కన్నుమూశాడు. కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న ఆయనకు ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మంగళవారం తుది శ్వాస విడిచాడు. సుమారు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్ హీరోలకు మేకప్‌మెన్‌గా పని చేశాడు. ఉత్తమ మేకప్ మ్యాన్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు. అంతేకాకుండా హీరో శివాజీకి వ్యక్తిగత మేకప్ మ్యాన్‌గానూ పని చేశాడు. ఆయన మృతి పట్ల హీరో శివాజీ, నిర్మాత బెక్కెం వేణు గోపాల్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. Chief Makeup man #Gangadhar Passed away due to #Covid19. He has worked for almost all the actors in multiple languages over the past 25 years. Hero #Sivaji Producer @BekkemVenugopal and many people from the industry expressed their deep condolences @luckymediaoff pic.twitter.com/74SqSTR2rj — BARaju (@baraju_SuperHit) May 18, 2021 చదవండి: OTT: ఈ పాపులర్ సినిమాలు చూశారా? -
కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేకమంది స్టార్స్ దీని బారిన పడ్డారు. దీంతో పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లొకేషన్లలో పాల్గొంటున్నారు. కోవిడ్ దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ షూటింగ్ లొకేషన్లో జగపతి బాబు.. కరోనా కారణంగా తనకు తానే మేకప్‌మెన్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్..నీ వల్ల మేకప్ మెన్ని అయ్యానంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషిస్తూ సత్తా చాటుతున్నారు. చదవండి : కరోనా బారిన నటి సమీరా Thanks to covid..I have become my own make up man. Ha haa.#StayHomeStaySafe pic.twitter.com/oeOBGEkrWd — Jaggu Bhai (@IamJagguBhai) April 18, 2021 -
కష్టాలను జయించి.. కలను బతికించి..!
మేకప్‌మ్యాన్‌గా రాణిస్తున్న రామాంజనేయులు నిట్రవట్టి నుంచి ప్రస్థానం ఫిలింనగర్లో ప్రావీణ్యం పలు సినిమాల్లో అవకాశం రంగులన్నీ కలిపి..బ్రష్ పట్టుకొని..ఓ యువతికి అందంగా మేకప్ వేసే కల.. అతన్ని వెంటాడింది. వేదనకు గురిచేసింది. పుట్టు పేదరికం.. తండ్రికి కాళ్లు లేవు..కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించే అమ్మ.. పెద్ద చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు.. అయినా అతనిలో ‘కల’ చావలేదు. చదువును అర్ధంతరంగా ఆపేసి ఆర్థికంగా కుదుటపడేందుకు చెప్పినపనల్లా చేశాడు. తన కలను నెరవేర్చుకునేందుకు కష్టాలను ఎదుర్కొన్నాడు. నేడు సినిమా హీరో, హీరోయిన్లకు మేకప్ వేస్తూ బిజీ ఉన్నాడు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన రామాంజనేయులు విజయగాథ ఇది.. ఆలూరు: ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం నృత్యం, నాటకం...మరేదైనా కళ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆంగికం, వాచకంతోపాటు ఆహార్యం(మేకప్) తప్పని సరి. పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చేర్చేది అదే. అందుకే భరతుడు తన నాట్యశాస్త్రంలో ఆహార్యాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. అయితే నటీనటులకు, కళాకారులకు వచ్చిన పేరు వారిని అందంగా తీర్చిదిద్దిన మేకప్‌మెన్‌లకు రావడం లేదు. అయినా ఈ కళలో తమను తాము నిరూపించుకునేందకు కొందరు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిలో రామాంజనేయులు ఒకరు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన తిమ్మప్ప, దేవమ్మ దంపతుల పెద్దకుమారుడు రామాంజనేయులు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్నది అతని కల. గ్రామాల్లో నాటకాలు వేసే సమయంలో..ధుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, హనుమంతుడు తదితర పాత్రధారులకు మేకప్ వేసే విధానాన్ని ఆసక్తిగా గమనించే వాడు. ఎప్పటికైనా సినిమాల్లో మేకప్‌మెన్‌గా స్థిరపడాలన్నదే తన ఆశయమని గ్రామస్తులకు చెప్పేవాడు. కుటుంబం పేదరికంలో ఉండంతో హాలహర్విలో పదోతరగతి పూర్తయిన వెంటనే బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. డబ్బు కూడబెట్టేందుకు ఇంటి నిర్మాణ పనులు చేశాడు. ఖాళీ సమాయల్లో ఎవరైనా పనిచెబితే కాదనేవాడు కాదు. కొంత డబ్బు పోగయ్యాక ఫిలింనగర్ వెళ్లి అవకాశాల కోసం వేట మొదలు పెట్టాడు. అక్కడ కొందరి వద్ద మేకప్ ఎలా వేయాలో నేర్చుకున్నాడు. బుల్లితెరలో అవకాశం.. మేకప్ మెన్ తన కల అని.. పని ఇవ్వాలని అక్కడ సినీనటులను ప్రాధేయపడేవాడు. నైపుణ్యం లేకపోవడంతో వారు అందుకు నిరాకరించేవారు. నిరుత్సాహ పడకుండా బుల్లితెరలో అవకాశాలను కోసం ప్రయత్నించాడు. ప్రయత్నం గట్టిగా ఉండడంతో అతనికి అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని తన నైపుణ్యమేమిటో తేల్చిచెప్పాడు. ఇంతటితో ఆగకుండా..గుజరాత్‌కు వెళ్లి మేకప్ సంస్థలో శిక్షణ పొంది తిరిగి హైదారాబాద్‌కు వచ్చారు. జనతా గ్యారేజ్‌లో.. పనితనం ఎల్లకాలం బయటకు రాకుండా మానదు. అలాగే రామాంజనేయులు పనితనం కూడా వెలుగులోకి వచ్చింది.. గబ్బర్‌సింగ్, జనతాగ్యారేజ్ సినిమాల్లో నటీనటులకు ఇతను మేకప్ వేశారు. అలాగే తమిళ, మళియాళం సినిమాల్లోనూ నటీనటులకు మేకప్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘‘బతుకుదెరువు కోసం అష్ట కష్టాలు పడ్డాను. ఎన్నో రాత్రులు పస్తులతో గడిపాను. బ్రష్ పట్టుకొని మేకప్ వేస్తున్నప్పుడు ఇవ్వన్నీ మరచిపోతాను.’’ అని రామాంజనేయులు తన స్వగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. తన ‘కల’ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని.. మేకప్ కళను ప్రోత్సహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖన విద్యను నేర్పించాలన్నారు. -
మేకప్‌మ్యాన్ కోసం ఫ్రీగా సినిమా!
సినీ తారలు తమ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సిబ్బంది కోసం సినిమాలు చేయడం లేదా వారి సినీ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందాల తార అనుష్క తన మేకప్ మ్యాన్ కోసం ‘పంచాక్షరి’ సినిమాలో నటిస్తే, తమిళ సూపర్‌స్టార్ అజిత్ ఓ అడుగు ముందుకు వేసి తన సిబ్బంది కోసం ఇళ్లు కట్టించే పనిలో ఉన్నారు. ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి జుహీచావ్లా కూడా చేరిపోయారు. జుహీ చావ్లా దగ్గర 18 ఏళ్ల నుంచి మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న సుభాష్ సింగ్ త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో జుహీదీ కీలక పాత్ర. దాంతో పాటు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట జుహీ. ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో, పారితోషికం కూడా తీసుకోకుండానే నటిస్తానని హామీ ఇచ్చారట. ఈ సినిమాలో జాకీష్రాఫ్, సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఏ పారితోషికం తీసుకోకుండానే నటి ంచడానికి ఒప్పుకున్నారని సుభాష్ సింగ్ చాలా సంబరపడిపోతూ చెప్పారు. -
కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!
‘‘సంగీతం, రచన... ఈ రెండింటికీ వయసుతో సంబంధం లేదు. మనసులో ఇష్టం, ఆలోచనల్లో కొత్తదనం ఉంటే చాలు. ఏ వయసులోనైనా ఇవి చేయొచ్చు’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. కొన్ని ఆల్బమ్స్‌కి సంగీతం సమకూర్చడంతో పాటు, పాటలు కూడా పాడారామె. శ్రుతి పాటలు, కవితలు కూడా రాస్తుంటారు. కథా నాయికగా చేయాలంటే చాలామంది మీద ఆధారపడాల్సి ఉంటుందనీ, కానీ సంగీతం, రచనలకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదనీ శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కథానాయికగా ఓ పాత్రలో ఒదిగిపోవాలంటే, మేకప్‌మ్యాన్ చేసే మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ చేసే కేశాలంకరణ చాలా ముఖ్యం. అలాగే, పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైనర్ సెలక్ట్ చేసే డ్రెస్ వేసుకోవాలి. ఆ తర్వాత డెరైక్టర్ చెప్పినట్లు చేస్తే, కెమెరామ్యాన్ చిత్రీకరిస్తారు. తెరపై కనిపించాలటే ఇంతమంది మీద ఆధారపడాలి. అదేగనక కథలూ, కవితలూ రాయాలనుకోండి... మన బుర్ర, కొన్ని కాగితాలు, కలం చాలు. ట్యూన్స్ తయారు చేయాలన్నా అంతే! సంగీత పరికరాలుంటే మనకు నచ్చిన ట్యూన్ రెడీ చేసుకోవచ్చు. అదే నాయిక పాత్రలనుకోండి... కొన్నేళ్ల తర్వాత చేయలేం. అది తెలుసు కాబట్టే, ఇప్పుడు బిజీగా సినిమాలు చేస్తున్నాను. కొంచెం తీరిక చిక్కాక సంగీతం, రచనలపై దృష్టి సారిస్తా’’ అన్నారు.