సిద్దయ్య కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం | financial help to late s.i siddaiah by nallagonda districkt | Sakshi
Sakshi News home page

సిద్దయ్య కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం

Published Tue, May 19 2015 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎస్.ఐ. సిద్దయ్య కుటుంబానికి మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ ప్రత్యేక ఆర్ధిక సహాయం ప్రకటించారు.

నల్గొండ: ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎస్.ఐ. సిద్దయ్య కుటుంబానికి మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ ప్రత్యేక ఆర్ధిక సహాయం ప్రకటించారు.. దేవరకొండ డివిజన్ పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో సేకరించిన విరాళాల మొత్తం రూ. 67,300/-ల నగదును ఎస్పీ తరఫున డీఎస్పీ చంద్రమోహన్, సి.సి.ఎస్. డీఎస్పీ సునితా మోహన్‌లు..  సిద్ధయ్య భార్య ధరణీషకు అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సిద్దయ్య కుటుంబానికి పోలీస్ శాఖ తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ కావాలనే ఆకాంక్షను దరణీష వెలుబుచ్చడంతో ఆమేరకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement