సిద్దయ్య కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం
నల్గొండ: ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎస్.ఐ. సిద్దయ్య కుటుంబానికి మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ ప్రత్యేక ఆర్ధిక సహాయం ప్రకటించారు.. దేవరకొండ డివిజన్ పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో సేకరించిన విరాళాల మొత్తం రూ. 67,300/-ల నగదును ఎస్పీ తరఫున డీఎస్పీ చంద్రమోహన్, సి.సి.ఎస్. డీఎస్పీ సునితా మోహన్‌లు.. సిద్ధయ్య భార్య ధరణీషకు అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సిద్దయ్య కుటుంబానికి పోలీస్ శాఖ తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ కావాలనే ఆకాంక్షను దరణీష వెలుబుచ్చడంతో ఆమేరకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందజేస్తామన్నారు.