
స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలు ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెలూన్లు అమ్ముకోవడం కోసం పడే కష్టం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో.... ఒక పిల్లాడు కీచైన్‌లు అమ్మడం కోసం ఫుట్‌పాత్‌పై కూర్చున్నాడు. కాలికి అయిన గాయానికి ప్లాస్టిక్ పేపర్ చుట్టుకున్నాడు.
సాక్షి అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో 7.4 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘అయ్యయ్యో’ అని సానుభూతి చూపుతున్న వాళ్లతో పాటు... ‘పిల్లాడి తల్లిదండ్రుల తప్పా? వ్యవస్థ తప్పా?’ అని ప్రశ్నించేవాళ్లు.... ‘ఆ పిల్లాడికి నా వంతుగా సహాయం చేస్తాను’ అని ముందుకు వస్తున్నవారు ఎందరో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment